Begin typing your search above and press return to search.

పవన్ బాబాయ్ స్ఫూర్తితోనే 'గని' చేశాను: వరుణ్ తేజ్

By:  Tupaki Desk   |   3 April 2022 3:50 AM GMT
పవన్ బాబాయ్ స్ఫూర్తితోనే గని చేశాను: వరుణ్ తేజ్
X
'గని' సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. మామూలుగా 'ఉగాది' పండుగ ఇంట్లో వాళ్లతో జరుపుకుంటారు. కానీ నేను ఈ రోజున మా అమ్మానాన్నలను కలవడం కూడా కుదరలేదు. ఇలా మీ అందరినీ చూడటమే నాకు ఆనందం. కోవిడ్ కారణంగా 'గని' సినిమాను మూడేళ్లపాటు చేయవలసి వచ్చింది. అయినా ఎప్పుడూ నిరాశపడలేదు.

మీ అందరినీ సంతోషపెట్టడం కోసం కష్టపడుతూనే ఉంటాము. ఈ రోజున ఈ ఫంక్షన్ ను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కిరణ్ కు నాకు నాలుగైదు ఏళ్లుగా పరిచయం. చాలా ఏళ్లుగా తాను పెద్ద పెద్ద దర్శకుల దగ్గర పనిచేశాడు. కిరణ్ ను నమ్మి ఈ సినిమా బాధ్యతను ఆయనకి అప్పగించడం జరిగింది. మొన్న ఈ సినిమా చూసిన తరువాత నేను తప్పు చేయలేదనిపించింది. కిరణ్ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనుకున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను.

ఎందుకంటే ఈ సినిమాకి నేను ఎంత ప్రాణం పెట్టి పనిచేశానో. మిగతా వాళ్లంతా కూడా అలాగే పనిచేశారు. ఫస్టు కిరణ్ వచ్చి నాకు కథ చెప్పాడు. అప్పడు నాకు బాబీ - సిద్ధు గుర్తుకు వచ్చారు. వాళ్లకి సినిమా అంటే ఫ్యాషన్ కాదు .. పిచ్చి. అందువలన వాళ్లతో చేయాలనిపించింది.
ఇంతవరకూ నా సినిమా కోసం ఏ నిర్మాత పెట్టనంత డబ్బు పెట్టారు. భయపడకండి .. తప్పకుండా వెనక్కి వస్తాయి. ఈ సినిమా మేము ఎవరికైతే చూపించామో వాళ్లంతా కూడా సైయీ చాలా బాగా చేసిందని చెబుతున్నారు. సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుందని నేను భావిస్తున్నాను.

కల్యాణ్ బాబాయ్ 'తమ్ముడు' సినిమా నాకు చాలా ఇష్టం .. చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. అలాంటి సినిమా చేయాలని ఉండేది .. అది ఇప్పటికి కుదిరింది. పవన్ బాబాయ్ స్ఫూర్తితోనే ఈ సినిమా చేశాను. 'తమ్ముడు' అంత బాగా అనిపించాలని ట్రై చేశాము.

ఇక్కడికి వచ్చేముందు చిరంజీవిగారు కాల్ చేసి .. ఫంక్షన్ బాగా చేయమని చెప్పారు. చిరంజీవిగారి గురించి మాట్లాడకపోతే అది నాకు కంప్లీట్ అయినట్టుగా అనిపించదు. ఆయన లేకపోతే నేను లేను. పెదనాన్నగారిగానే కాదు .. ఒక స్టార్ గా కూడా ఆయన నాకు స్ఫూర్తి. ఈ సినిమాకి అవసరమైన బాడీని బిల్డ్ చేయడానికి చరణ్ నాకు ఒక ట్రైనర్ ను ఇచ్చాడు.

ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా గాయాలయ్యాయి. అప్పుడు కూడా బాధపడలేదు. మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలనే విషయం గుర్తుకు వచ్చేయేసరికి వెంటనే లేచి షూటింగు చేసేవాడిని. మీరంతా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాటిలో ప్రతి రూపాయికి వాల్యూ ఇవ్వాలనే మేమంతా కష్టపడుతూ ఉంటాము. 'గని' తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెడుతుంది .. మీ అంచనాలను అందుకుంటుంది" అని చెప్పుకొచ్చాడు.