Begin typing your search above and press return to search.

భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్న మెగా 'గని'

By:  Tupaki Desk   |   7 April 2022 2:30 PM GMT
భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్న మెగా గని
X
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. రేపు శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈరోజు గురువారం యూఎస్ఏ ప్రీమియర్స్ పడనున్నాయి.

ఇప్పటికే 'గని' సినిమాకు సంబంధించిన టీజర్ - ట్రైలర్‌ - పాటలు విశేష స్పందన తెచ్చుకుని బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల టీమ్ అంతా వరుసగా ఇంటర్వ్యూలు - ప్రత్యేక ఈవెంట్స్ చేస్తూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'ఎఫ్ 2' 'గద్దల కొండ గణేష్' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న ''గని'' సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 21 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రేడ్ లెక్కల ప్రకారం..‘గని' మూవీ నైజాంలో రూ. 8 కోట్లు - సీడెడ్‌ లో రూ. 3.50 కోట్లు - ఆంధ్రాలో మిగిలిన అన్ని ప్రాంతాలు కలుపుకుని రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

'ఫిదా' 'ఎఫ్ 2' సినిమాల తర్వాత ఓవర్సీస్ లోనూ వరుణ్ తేజ్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 'గని' సినిమా ఓవర్సీస్‌ లో రూ. 1.80 కోట్లు - కర్నాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు రూ. 25.30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలను బట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 26.30 కోట్లుగా ఉంది.

కాగా, 'గని' చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన దబాంగ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ ‏గా నటించింది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నదియా - నరేష్ - తనికెళ్ళ భరణి - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ మరియు రెనసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు వెంకటేష్ (బాబీ) - సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. మరికొన్ని గంటల్లో భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ రింగ్ లో దిగుతున్న గని పంచ్ ఎలా ఉంటుందో చూడాలి.