Begin typing your search above and press return to search.
వరుణ్.. తదుపరి సినిమాలు ఇవే
By: Tupaki Desk | 10 Feb 2018 11:30 PM GMTవరుణ్ తేజ్ తొలిప్రేమ ఈ రోజు విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంటోంది. మొత్తమ్మీద యావరేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు వరుణ్ తేజ్ తన తరువాతి సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆ సినిమాల గురించి ఓ ఇంటర్య్వూలో చెప్పాడు కూడా. టాలీవుడ్ యంగ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన తొలిసినిమాతోనే ఇండస్ట్రీని ఆకర్షించాడు. మొదటి సినిమానే అద్భుతమైన టేకింగ్ తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఘాజీ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ కట్టిపడేసింది.
ఇకపోతే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తరువాత సినిమా చేస్తున్నానని, ఇది అంతరిక్షానికి - సైన్సుకు సంబంధించిన సినిమా అని చెప్పాడు వరుణ్ తేజ్. ఈ సినిమాను భారీ విజువల్ ఎఫెక్ట్స్ - భారీ సెట్స్ తో సినిమాను రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. అయినా సరే ఖర్చు భారీ పెరగకుండా... అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తిచేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట సంకల్ప్ రెడ్డి. వరుణ్ తేజ్ చెప్పిన ప్రకారం... ఈ సినిమాను కంచె సినిమాను నిర్మించిన రాజీవర్ రెడ్డి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
వరుణ్ ఈ సినిమాలో నటించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అది తనకు కచ్చితంగా ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని చెప్పాడు వరుణ్. నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. కానీ ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నాడు వరుణ్. ప్రస్తుతం కథ - స్క్రీన్ ప్లే రెడీ అయ్యాకే తనకు కూడా పూర్తిగా వివరాలు తెలుస్తాయని చెప్పాడు. అంటే ఫన్ అండ్ర ఫ్రస్ట్రేషన్ మల్టీస్టారర్ లో వెంకీతో కలసి వరుణ్ కనిపిస్తాడనమాట.