Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్‌... గ్లోబల్ ఇష్యూతో మెగా హీరో మూవీ

By:  Tupaki Desk   |   22 Sep 2022 1:30 AM GMT
ఇంట్రెస్టింగ్‌... గ్లోబల్ ఇష్యూతో మెగా హీరో మూవీ
X
గని సినిమాతో నిరాశ పర్చిన వరుణ్‌ తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమా ను మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఈసారి ఈ మెగా హీరో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్‌ చేయబోతున్నాడు. ఈ విషయం పై పలు ఆసక్తికర వార్తలు మెగా కాంపౌండ్‌ నుండి వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ 13వ సినిమా ఒక గ్లోబల్‌ ఇష్యూ తో రూపొందబోతుందని.. అందుకే ఆ కథతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్‌ అవుతారు అంటూ సమాచారం అందుతోంది. తప్పకుండా ఈ సినిమా భారీగా ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచే విధంగా లీక్స్ ఇస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్‌ ను అక్టోబర్ 10వ తారీకు మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలో విలన్ పాత్రకు గాను వినయ్ రాయ్ ని సంప్రదించారని.. మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందించబోతున్నాడని తెలుస్తోంది. బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

గద్దలకొండ గణేష్ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న వరుణ్‌ తేజ్ గని మరియు ఎఫ్ 3 సినిమా లతో నిరాశ పర్చాడు. కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్‌ లో సినిమా మొదలు అవ్వబోతున్న నేపథ్యంలో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలు కలిగి ఉంటుందనే సమాచారం అందుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.