Begin typing your search above and press return to search.
6 ప్యాక్.. కిక్ బాక్సింగ్.. గెట్ రెడీ
By: Tupaki Desk | 2 March 2019 5:12 PM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రయోగాల గురించి తెలిసిందే. హీరోగా వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డ్ ప్రస్తుతం ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్. మెగా హీరోల్లోనే డేరింగ్ డెసిషన్స్ తీసుకునే హీరోగా అతడికి గుర్తింపు ఉంది. వరుణ్ కథల ఎంపిక ఛాయిస్ సర్ ప్రైజ్ ని ఇస్తోందని చరణ్ అంతటి హీరో అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ముకుంద, కంచె, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2 .. ఇలా ప్రతిదీ వేటికవే ప్రత్యేకం. ఒకదానితో ఒకటి సంబంధం లేని కథల్ని ఎంచుకున్నాడు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ వరుణ్ గ్రాఫ్ ని పెంచాయి. వరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్ కొత్త లుక్ కి ఛేంజ్ అవుతున్నాడని తెలుస్తోంది.
వరుణ్ ఆలోచనా శైలి ఎంత వైవిధ్యంగా ఉంటుందో తాజా రివీలైన లుక్ చెబుతోంది. అతడు మరోసారి ప్రయోగంతో కూడుకున్న కమర్షియల్ స్టోరీని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. వరుణ్ ని వెండితెరపై మరో కొత్త లుక్ లో ఫ్యాన్స్ చూడబోతున్నారు. అతడు కిక్ బాక్సర్ గా అలరించనున్నాడు. పైగా 6 ప్యాక్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇవి రెండూ ఎంతో ఛాలెంజింగ్ టాస్క్స్ కాబట్టి అందుకు తగ్గట్టే వరుణ్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. రెగ్యులర్ జిమ్ తో లుక్ ని ఛేంజ్ చేస్తున్నాడు.
తాజాగా మారిన లుక్ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు వరుణ్. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత ఎంతగా అలసిపోయాడో ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. చెమటతో తడిసి ముద్దయిన షర్ట్.. బాగా పెరిగిన గుబురు గడ్డం.. ఆ రగ్గ్ డ్ లుక్ చూస్తుంటే సాధన కఠోరంగానే ఉందని తెలిసిపోతోంది. ఈ ఫోటో తో పాటుగా `టైర్ డఫ్` అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. 6 ప్యాక్.. కిక్ బాక్సింగ్.. గెట్ రెడీ!!