Begin typing your search above and press return to search.
కండోమ్ యాడ్ లో కవ్వించేసిందంతే
By: Tupaki Desk | 6 April 2018 4:14 AM GMTసినిమా హీరోయిన్స్ ప్రకటనల్లో కనిపించడం కొత్తేమీ కాదు కానీ.. కొన్ని రకాల యాడ్స్ లో నటించేందుకు చాలామంది సందేహిస్తుంటారు. ముఖ్యంగా కండోమ్ యాడ్స్ విషయంలో మోడల్స్ కానీ.. సెక్సీ ఇమేజ్ ఉన్న వాళ్లు తప్ప.. కొత్త హీరోయిన్లు ఈ విషయంలో అలర్ట్ గా ఉంటారు. తమను అడల్ట్ కంటెంట్ సినిమాలకు.. ఈరోటిక్ మూవీస్ కి పరిమితం చేసేస్తారేమోనని వాళ్ల భయం. ఇండస్ట్రీ జనాల వాలకం ప్రకారం.. వాళ్ల భయంలో కూడా మీనింగ్ ఉంది.
ముంబై భామ కావ్య థాపర్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమాలో ఈమె హీరోయిన్. ఆ చిత్రంతో పాటే వరుణ్ తేజ్ హీరోగా.. ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తీస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా అందుకుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే.. రెండో సినిమాను.. అందులోను మెగా హీరోతో మూవీ చేసే ఛాన్స్ అందుకున్న ఈమె స్పీడ్ చూసి.. అందరూ షాక్ తినేశారు కూడా. ఇప్పుడు వాళ్లకు ఇంకో షాక్ ఇచ్చింది కావ్య థాపర్.
ఓ కండోమ్ కంపెనీ యాడ్ లో నటించేసింది కావ్య. ఇందులో మరీ బికినీ యవ్వారాలు.. శృతి మించిన శృంగారం లాంటివి ఏమీ లేవు కానీ.. భర్త కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న భార్యగా కనిపించింది కావ్య. మెగా హీరోయిన్ అనే ట్యాగ్ కంటే ముందే కండోమ్ యాడ్ లో కనిపించిన బ్యూటీ అనే ముద్ర వేయించేసుకుంటోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి