Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే!
By: Tupaki Desk | 17 Sep 2019 5:54 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారి మాస్ అవతారం ఎత్తిన వాల్మీకి ఈ శుక్రవారమే విడుదల కానుంది. మాములుగా మెగా సినిమాలు వచ్చే టైంలో ఉండే ఫీవర్ దీనికి ఆ స్థాయిలో కనిపించనప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం హీరోతో పాటు దీని మీద చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ కు ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. ఇప్పటిదాకా కెరీర్ లో వరుణ్ గర్వంగా చెప్పుకునే హిట్స్ రెండు. ఒకటి ఎఫ్2 రెండు ఫిదా.
వెంకటేష్ క్రెడిట్ మొత్తం తీసేసుకోవడంతో ఎఫ్2 బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల వరుణ్ తేజ్ కు ఒరిగింది పెద్దగా ఏమి లేదు. పైపెచ్చు ఒకరకమైన సపోర్టింగ్ హీరోలా కనిపించాడు. ఇక ఫిదాతో తనను డామినేట్ చేసి మరీ సాయి పల్లవి పేరు కొట్టేయడం తనకు తెలియంది కాదు. సో వీటిని తన సోలో ఎకౌంటులో వేసుకోలేడు. కష్టపడి చేసిన అంతరిక్షం - కంచె లాంటి సినిమాలు పేరు ఇచ్చాయి కాని నిర్మాతలకు ఆశించిన లాభాలు మాత్రం తెలేకపోయాయి
సో వరుణ్ స్టామినాకు వాల్మీకి ఒకరకంగా అగ్ని పరీక్ష లాంటిది. తేడా కొడితే సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి కథలు ఎందుకు అనే కామెంట్స్ వస్తాయి. హిట్ అయితే ముందు హరీష్ శంకర్ పేరు లాగేసుకోవడానికి ట్రై చేస్తాడు. అఫ్ కోర్స్ ఒకవేళ వరుణ్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తే అదేమీ సమస్య కాదు కాని ఎటొచ్చి అంచనాలు అందుకోలేకపోతేనే లేనిపోని ఇబ్బంది. ఇప్పుడు వాల్మీకి రేంజ్ ని బట్టే నెక్స్ట్ కమిట్ అయ్యే సినిమాలకు ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలి అనే క్లారిటీ వస్తుంది. బయట చూస్తేనేమో వాల్మీకి ఫస్ట్ డే అద్భుతాలు చేసే సీన్ కనిపించడం లేదు. మౌత్ టాక్ మీదే ఆధారపడ్డ ఈ పబ్లిక్ ఎగ్జాం లాంటి పరీక్షలో వరుణ్ తేజ్ ఎన్ని మార్కులతో పాస్ అవుతాడో వేచి చూడాలి