Begin typing your search above and press return to search.
కంచె బ్రేక్ వేయాల్సిందేనయ్యా
By: Tupaki Desk | 19 Oct 2015 1:30 PM GMTప్రస్తతం టాలీవుడ్ లో మెగా హీరోల పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆ మధ్య మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ మంచి టాక్ తెచ్చుకున్నా కాసులు మాత్రం రాలలేదు. వారం రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి తీసేశారు. ఓ వర్సీస్ లో అయితే పరిస్థితి మరీ దారణంగా ఉంది. ఇకపోతే రుద్రమదేవి సినిమాకు కాస్త ఉపశమనం కలిగినా కూడా.. బన్నీ క్యామియో వలన బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు.
తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ సినిమా కూడా బోర్లా పడింది. రొటిన్ స్టోరీ కావడంతో మల్టీ ప్లెక్స్ ల్లో అయితే మరీ బోర్ ఫీలయ్యారు. బి. సి సెంటర్లలలో ఏదో మెగా ఇమేజ్ ఉండటంతో ఆడపా దడపా జనాలు వస్తున్నారు మనహా అక్కడా నెగిటివ్ టాక్ తోనే ఆడుతోంది. క్రిటిక్స్ అయితే పెద్ద ప్లాప్ అని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫెయిల్యుర్స్ కి బ్రేక్ వేయడానికి మరో వారసుడు రంగంలోకి దిగుతున్నాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన కంచె సినిమా దసరా కానుకుగా ఈనెల 22న విడుదలవుతుంది. అఖిల్ సినిమా రేస్ నుంచి తప్పుకోవడంతో కంచె దిగుతోంది. ఇప్పుడు మెగా అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.
కంచె సినిమా అయినా సక్సెస్ అయితే తాత్కాలికంగా ప్లాప్ లకు బ్రేక్ వేసినట్లేనని ఎనలిస్ట్ లు అభిప్రాయ పడుతున్నారు. కనీసం ఈ సినిమా అయినా విజయం సాధిస్తే మెగా కాంపౌండ్ హ్యాపీగా పీలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.