Begin typing your search above and press return to search.
సండే ఫన్: హౌస్ లో హల్చల్ చేసిన 'గద్దలకొండ గణేశ్'
By: Tupaki Desk | 23 Sep 2019 5:01 AM GMTఎప్పటిలాగానే సండే ఫన్ డే అనే విధంగా ఈ ఆదివారం ఎపిసోడ్ కూడా కొనసాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో సరదా గేమ్స్ ఆడించి కింగ్ నాగార్జున ప్రేక్షకులని ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. ఎపిసోడ్‌లో ఎంటర్ అవ్వడమే శనివారం ఎపిసోడ్ లో రాహుల్ ని ఫేక్ ఎలిమినేషన్ తర్వాత...ఇంటిలో సభ్యులు ఎలా ఉన్నారు అనేది చూపించారు. నిజంగా రాహుల్ ఎలిమినేట్ అయిపోయాడనే బాధలో వరుణ్ - పునర్నవి ఉన్నారు. అలాగే రాహుల్ ఇంకో ప్రత్యేక గదిలో ఉన్నది కూడా ప్రేక్షకులకు చూపించారు.
దీని తర్వాత నాగ్....మన టీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించి...వారికి ఓ సరదా గేమ్ ఇచ్చారు. కెప్టెన్ మహేశ్ మినహా...మిగతా ఎనిమిది మందిని రెండు గ్రూపులుగా విభజించి డ్యాన్స్ పోటీ పెట్టారు. మొదటి గ్రూపులో బాబా భాస్కర్ - పునర్నవి - వరుణ్ - హిమజలు ఉండగా...రెండో గ్రూపులో శ్రీముఖి - శివజ్యోతి - వితికా - రవిలు ఉన్నారు. అయితే టాస్క్ లో భాగంగా మొదటి గ్రూపులో ఒకరు - రెండో గ్రూపులో ఒకరు వచ్చి నాలుగు పాటలకు డ్యాన్స్ చేయాలని పోటీ పెట్టారు. అలా మొదట వితికా - పునర్నవిలు పోటీ పడగా...ఇందులో వితికా గెలిచినట్లు కెప్టెన్ మహేశ్ ప్రకటించాడు.
ఆ తర్వాత బాబా - శ్రీముఖిలు పోటీ పడితే...బాబా విన్ అయ్యారు. ఇక హిమజ - శివజ్యోతిల్లో...హిమజ గెలిచింది. అలాగే వరుణ్ - రవిలో రవి విన్ అయ్యాడు. దీంతో ఓవరాల్‌గా శ్రీముఖి టీంకు 36 మార్కులు రాగా... వరుణ్ టీంకు 35 మార్కులు రావడంతో శ్రీముఖి టీం విన్ అయ్యింది. ఈ సరదా టాస్క్ తర్వాత ఇటీవల గద్దలకొండ గణేశ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
వరుణ్ అందరితో సరదా ముచ్చట్లు పెట్టారు. ఆ తర్వాత హౌస్ లోని లేడీ కంటెస్టంట్స్ వరుణ్ కి లవ్ ప్రపోజ్ చేయాలని... అందులో నచ్చిన వారి పేరు వరుణ్ చెబుతాడని నాగ్ ప్రకటించారు. దీంతో అందరు తమదైన శైలిలో ప్రపోజ్ చేశారు. అయితే అందరికంటే ఎక్కువ శివజ్యోతి...తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్పి ఇంప్రెస్ చేసిందని వరుణ్ చెప్పాడు. ఆ తర్వాత ఎలిమినేషన్ లో ఉన్న హిమజ - మహేశ్ లలో హిమజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హిమజ ఎలిమినేషన్ ను కూడా వరుణ్ స్వయంగా ప్రకటించాడు. ఇక హిమజ వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ మహేశ్ మీద వేసి వెళ్లింది.