Begin typing your search above and press return to search.
చిరు తర్వాత వరుణే!!
By: Tupaki Desk | 19 Dec 2015 5:30 PM GMTమెగా కథానాయకుల్లో చిరంజీవి నుంచి ఒకొక్కరికి ఒక్కో లక్షణం అబ్బింది. చిరులోని కామెడీ టైమింగ్ పవన్ లో కనిపిస్తుంటుంది. చిరులోని డ్యాన్స్ ఈజ్ బన్నీకి వచ్చింది. చరణ్ డైలాగ్ డెలివరీతోపాటు డ్యాన్సులు - ఫైట్లు అచ్చం చిరులాగే ఉంటాయి. ఇక సాయిధరమ్ తేజ్ తన మావయ్యలాగే కనిపిస్తూ అదరగొడుతుంటాడు. అయితే చిరులోని ఒక్క గుణం మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరికీ అబ్బలేదు. అదే... రొమాన్స్. హీరోయిన్లతో తెరపై రొమాన్స్ చేస్తూ మాస్ ని అలరించడంలో చిరుకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆ శైలిని ఇప్పటిదాకా ఏ మెగా కథానాయకుడు పట్టుకోలేకపోయాడు. కానీ ఇటీవలే తెరపైకొచ్చిన వరుణ్ తేజ్ కి ఆ రొమాంటిక్ లక్షణాలు బాగానే అబ్బినట్టు కనిపిస్తున్నాయి. లోఫర్ తో ఆ విషయం స్పష్టమైందని సినీ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
లోఫర్ లో వరుణ్ తేజ్ ఓ రొమాంటిక్ సాంగ్ చేశాడు. పూరి తనదైన మార్క్ తో ఆ పాటని షూట్ చేయించాడు. అది సినిమాకే హైలెట్ గా మారింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ హీరోయిన్ తో కలిసి రొమాన్స్ పండించిన తీరు అద్భుతం అంటున్నారు. వరుణ్ కి తన తొలి చిత్రం `ముకుంద`లో రొమాంటిక్ సన్నివేశాలు చేసే అవకాశం రాలేదు. అసలు అందులో హీరోయిన్ తో సన్నివేశాలే ఉండవు. రెండో చిత్రం కంచెలోనూ హీరోయిన్ తో రొమాన్స్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. లోఫర్ తో మాత్రం ఆ అవకాశం వచ్చింది. మొదట ప్రచార చిత్రాలు చూసినవాళ్లంతా ``పూరి వరుణ్ లోని రొమాంటిక్ యాంగిల్ ని చూపించే ప్రయత్నం చేసినట్టున్నాడు, మరి వరుణ్ ఎలా చేశాడో`` అని మాట్లాడుకున్నారు. తీరా తెరపై వరుణ్ రొమాన్స్ ని చూసినవాళ్లంతా ఫస్ట్ క్లాస్ మార్కులేశారు. వరుణ్ పది, పదిహేను సినిమాల అనుభవమున్న హీరోలాగా రొమాన్స్ పండించాడు. ఆ పాటని చూసినవాళ్లంతా రొమాన్స్ విషయంలో చిరు తర్వాత వరుణే అని మాట్లాడుకోవడం కనిపిస్తోంది. సో కీప్ ఇట్ అప్ వరుణ్... !