Begin typing your search above and press return to search.

ఇంద్ర 175 రోజుల వేడుక చూసి..

By:  Tupaki Desk   |   18 Feb 2018 9:28 AM GMT
ఇంద్ర 175 రోజుల వేడుక చూసి..
X
తనలోని హీరోను మొదటగా గుర్తించింది.. సినిమాల్లోకి రావాలన్న తన కోరికను బలపరిచి.. తనకు ప్రేరణగా నిలిచింది తన పెదనాన్న.. మెగాస్టార్ చిరంజీవే అంటున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. చిరంజీవి తనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా ఇన్ స్పైర్ చేశాడో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు వరుణ్.

‘మగధీర’ షూటింగ్ టైంలో చిరుతో కలిసి రాజస్థాన్ వెళ్లాడట వరుణ్. ఆ సందర్భంగా ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమైన చిరంజీవి.. వరుణ్ ఫొటోలు చాలానే తీశాడట. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఆ ఫొటోలు చూస్తూ.. నీలో మంచి ఫీచర్లున్నాయి. సినిమాల్లో ట్రై చేయొచ్చని చెప్పాడట చిరు. అప్పటికే సినిమాల్లోకి రావాలని తన మనసులో ఉండేదని.. చిరు చెప్పడంలో ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి ఇంట్లో విషయం చెప్పేశానని వరుణ్ తెలిపాడు.

ఇక చిరు తనను ఇన్ డైరెక్టుగా ఎలా ఇన్ స్పైర్ చేశాడో చెబుతూ.. ‘‘ఇంద్ర సినిమా 175 రోజుల వేడుకకు వెళ్లాను. అప్పుడు నేను చూస్తే నా కంటికి కనిపించినంత దూరం జనాలే ఉన్నారు. అది చూసి ఆశ్చర్యపోయాను. చివర్లో ఉన్న జనాల్ని చూసి నాకనిపించింది.. ఎందుకు చిరంజీవిపై ఇంత అభిమానం అని. అప్పుడే అనుకున్నా.. ఆయనంత కాకపోయినా నేనూ కొంతైనా అభిమానం సంపాదించాలని. ఇప్పుడు నటుడిగా జనాల అభిమానం గెలిచే పనిలో ఉన్నా’’ అని వరుణ్ తెలిపాడు.