Begin typing your search above and press return to search.

పవన్ అంటే హిస్టీరియానే -వరుణ్‌ తేజ్‌

By:  Tupaki Desk   |   13 Nov 2015 5:30 PM GMT
పవన్ అంటే హిస్టీరియానే -వరుణ్‌ తేజ్‌
X
మెగా వారసుడు వరణ్ తేజ్ టూర్ వెళ్తున్నాడు. కంచె సక్సెస్ జోష్ లో ఉన్న నాగబాబు తనయుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు కానీ.. హాలిడే టూర్ వెళ్లున్నానని కొన్ని రోజులు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండనంటూ ట్వీట్ పెట్టాడు. అందుకే వెళ్లే ముందు అభిమానులో రాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఒకటి నిర్వహించి.. బోలెడు ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకున్నాడు.

ఇతగాడికి నచ్చిన రంగు బ్లాక్ అంట.. అలాగే బ్లడ్ గ్రూప్ ఏబీ పాజిటివ్ అట. అది సరే.. ముకుంద - కంచెల్లో ఏ మూవీ ఇష్టమని అడిగితే.. కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగమన్నాడు వరుణ్ తేజ్. ఇక పవన్‌ కళ్యాన్‌ గురించి ఒక్క మాటలో చెప్పమంటే... అసలు ఈ ఫ్యాన్సు పిచ్చి కాని పవన్‌ గురించి సింగిల్‌ లైన్‌ లో ఎట్టా చెప్తాం అబ్బా?? అయినా సరే వరుణ్‌ ఒక ఆన్సర్‌ ఇచ్చాడు. ''పవర్‌ స్టార్‌ అంటే హిస్టీరియా. అంతే'' అన్నాడు.

మరిన్ని ప్రశ్నల విషయానికొస్తే.. ఇవిగో వరుణ్‌ సమాధానాలుః

- కాజల్ గురించి ఒక మాట
టూ క్యూట్

- ఫ్యావరేట్ క్రికెటర్ ఎవరు ?
సెహ్వాగ్

- ఆల్ టైం ఫ్యావరేట్ నటి?
రమ్యకృష్ణ గారు

- హిందీ నటుల్లో ఎవరు ఫ్యావరేట్స్ ?
షారూక్ ఖాన్ - రణ్ బీర్ కపూర్ - ఫరాన్ అక్తర్

- ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా ?
యస్, బ్రేకింగ్ బ్యాడ్ నా ఫ్యావరేట్ మూవీ

- పూరీ జగన్ లో నచ్చిందేంటి ?
నిజాయితీ

- మహేష్ బాబు సినిమాల్లో నచ్చినవి ?
పోకిరి, అతడు

- నచ్చిన హాలీడే స్పాట్
గోవా

- కంచెకి వచ్చిన ప్రశంసల్లో బెస్ట్
పెదనాన్న చిరంజీవి పొగడ్డమే

- కమల్ హాసన్ గురించి ఒకమాట
అంతర్జాతీయ స్థాయి నటుడు