Begin typing your search above and press return to search.
ఆ చెట్టు నీడలోనే పెరిగాం -వరుణ్ తేజ్
By: Tupaki Desk | 28 Oct 2015 5:30 AM GMTకంచె సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడన్న ప్రశంసలు అందుకుంటున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా వైవిధ్యం ఉన్న కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటోందన్న టాక్ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యం, ప్రేమకథని ముడివేస్తూ క్రిష్ చక్కగా తెరకెక్కించాడన్న ప్రశంసలొచ్చాయి. టెక్నికల్ గా అద్భుత చిత్రంగా పేరొచ్చింది.
అయితే ఈ సక్సెస్ గురించి వరుణ్ తేజ్ ముచ్చటిస్తూ ... నా జీవితంలో ఎలా సాగుతుందో జాగ్రత్తగా గమనిస్తున్నా. ఇలాగే ముందుకు వెళుతుందని నేను ఊహించలేదు. నేనింకా రెండు సినిమాల కిడ్ ని. ముకుంద సినిమాతో హీరోనయ్యా. మొదటి సినిమాకే పేరొచ్చింది. ఇప్పుడు రెండో ప్రయత్నం గుర్తింపు పెంచింది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మేల్ - ఫీమేల్ ఫ్యాన్స్ ఫాలో చేయడం సంతోషాన్నిస్తోంది. అలాగే అభిమానుల్లో ఆడ - మగ అనే తరతమ భేధం లేదు. అందరికీ సమాన ప్రాధాన్యతనిస్తాననని వరుణ్ తేజ్ మురిపెంగా చెబుతున్నాడు.
ఇప్పుడు మెగా హీరోలు చరణ్ - బన్నిలకు మీరు పోటీనా అన్న ప్రశ్నకు.. అలాంటిదేం లేదు. నేనింకా కిడ్ నే. చరణ్ ని ఓ అన్నగా కంటే స్నేహితుడిగానే భావిస్తా. ఏం కావాలన్నా తననే అడుగుతా. అలాగే చిన్నప్పట్నుంచి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగాం. కాబట్టి హీరోయిజం అన్న వాతావరణం ఇంట్లో ఉంది. మేమంతా ఆ చెట్టు నీడలోనే పెరిగాం. చరణ్ - నేను - నాగచైతన్య - అఖిల్ - పవన్ బాబాయ్ - బన్ని.. మేమంతా వీలున్నప్పుడల్లా బైట శికార్లకు కూడా వెళ్లొస్తుంటాం. మా మధ్య చాలా చనువు ఉంది.. అంటూ వరుణ్ తేజ్ చాలా సంగతులే ముచ్చటించాడు.
త్వరలోనే ఓ మాంచి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మా అమ్మ మహాలక్ష్మి (అప్పట్లో లోఫర్).. తల్లి - కొడుకుల మధ్య సాగే ఇంట్రెస్టింగ్ స్టోరి. త్వరలోనే రిలీజ్ కి వస్తోంది.. అని వరుణ్ తేజ్ చెప్పాడు.