Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి సర్వసన్నాహకం
By: Tupaki Desk | 6 July 2021 7:30 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ వరుణ్ ని లాంచ్ చేయడానికి సిద్దంగా ఉందిట. వరుణ్ తేజ్ ఇప్పటికే తెలుగులో పాపులర్ స్టార్. కమర్శియల్ చిత్రాలతో పాటు `అంతరిక్షం` లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి బెస్ట్ పెర్పామర్ గా నిరూపించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ మార్కెట్ డబుల్.. ట్రిపుల్ అయింది. ఒక్కో సినిమాకు 15 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ హిందీ చిత్రాలపై కూడా దృష్టి పెట్టినట్లు తాజాగా గుసగుస వినిపిస్తోంది.
రెండు మూడేళ్లగా చాలా మంది తెలుగు హీరోలు స్థానిక భాషతో పాటు ఇతర భాషల్లోనూ మార్కెట్ ను కొల్లగొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుణ్ కూడా ఈసారి బాలీవుడ్ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడితో హిందీ- తెలుగు ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ యంగ్ డైరెక్టర్ పేరు ఎక్కడా రివీల్ కాలేదు గానీ ప్రాజెక్ట్ మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. దర్శకుడు వినిపించిన స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చి వెంటనే లాక్ చేసాడు.ఈ సినిమా కథ ఆసక్తికరం. అలాగే కథనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కాదని...కేవలం హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసి రూపొందించే చిత్రమని సమాచారం.
ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సోని పిక్చర్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇదే సంస్థ అడవిశేషు ని హీరోగా హిందీ లాంచింగ్ మూవీ `మేజర్`ని నిర్మిస్తోంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు హీరోల్ని సోనీ పిక్చర్స్ బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతల్ని తీసుకోవడం విశేషం.