Begin typing your search above and press return to search.

నితిన్ కోసం మెగా హీరో..!

By:  Tupaki Desk   |   21 Feb 2021 12:50 AM GMT
నితిన్ కోసం మెగా హీరో..!
X
సినిమా వాళ్ళ మధ్య లవ్ అనేది కామన్ గా వినిపించే విషయమే. కొన్ని జంటల ప్రేమాయణం పెళ్లి పీటల దాకా వస్తే మరికొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఓ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తోంది. పెద్ద ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో.. ఓ కుర్ర బ్యూటీతో డేటింగ్ లో ఉన్నాడనేది పేజ్-3 ఫోక్స్ మ‌ధ్య హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్న ఆ తెలుగమ్మాయిని ఆ హీరో ఎప్ప‌టినుంచో ఫాలో అవుతున్నాడట. అనేక విధాలుగా ట్రై చేసిన యువ హీరో ఎట్టకేలకు ఆమెను మెప్పించాడట. అప్పటి నుంచి ఈ జంట డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న ఆ హీరో పెళ్లి.. మీడియా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. అయితే పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి సమాధానం దాటవేస్తూ వచ్చాడు. దీనికి కారణం సదరు హీరోయిన్ తో డేటింగ్ లో ఉండటమేనట. ఇటీవల ఆ హీరో ఫ్యామిలీలో జరిగిన వివాహానికి అమ్మడు వెళ్ల‌డం వెనుక కారణం కూడా అదేనట. ప్రస్తుతం ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ల‌వ్ ట్రాక్ స‌క్సెస్ అయితే త్వరలోనే టాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ పెళ్లిని కూడా చూడొచ్చన్నమాట.