Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ నిజంగా డైరెక్టర్ల హీరోనే

By:  Tupaki Desk   |   12 April 2017 5:30 PM GMT
వరుణ్ తేజ్ నిజంగా డైరెక్టర్ల హీరోనే
X
టాలీవుడ్ లో డైరెక్టర్ల హీరో అనిపించుకునే బాపతు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్క సినిమా ఆడడం ఆలస్యం.. ఇక మూవీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ వేళ్లు పెట్టేసే కుర్ర హీరోలున్న ఇండస్ట్రీ మనది. ఇక స్టార్ హీరోల సంగతైతే చెప్పనక్కర్లేదు. వారసత్వంగా అందుకున్న క్రేజ్ కి తమ ప్రతిభను జోడించి మరింత పేరు సంపాదించుకుని.. ఇప్పుడు డైరెక్టర్ ని పక్కకు తోసి తామే సినిమాలు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు.

ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం డైరెక్టర్ చెప్పినది చేసి.. తూచా తప్పకుండా పాటిస్తూ.. డైరెక్టర్ల హీరో అనిపించుకుంటున్నాడు. తనకు సినిమా మేకింగ్ గురించి ఏ మాత్రం తెలియదని చెబుతున్న వరుణ్ తేజ్.. డైరెక్టర్ ఏం చెబితే అది చేయడమే తన పని అంటున్నాడు. తనకేమైనా అనుమానాలున్నా.. సలహాలు సూచనలు ఇచ్చే పని మాత్రం పెట్టుకోనని చెప్పేసిన వరుణ్ తేజ్.. అది వాళ్ల వృత్తి కాబట్టి వాళ్లు నమ్మిందే చేయడం కరెక్ట్ అంటున్నాడు.

ఇప్పటివరకూ పెద్ద డైరెక్టర్లతో చేశాడు కాబట్టి ఇలా అంటున్నా అనుకోవచ్చని.. త్వరలో కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నానని చెప్పిన వరుణ్ తేజ్.. ఆ డైరెక్టర్ చెప్పినది చేయడం తప్ప.. తాను ఇసుమంతైనా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోనంటూ.. దర్శకుల హీరో అనే పేరును సార్ధకం చేసేసుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/