Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ కొత్త సినిమాకు లాంచ్ డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 24 Jan 2019 6:39 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ ప్రారంభం నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాలో నటిస్తూ మెగా ఫ్యామిలీ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టిస్టారర్ 'F2' తో వరుణ్ రీసెంట్ గా సూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుణ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.
అందులో ఒకటి తమిళ సూపర్ హిట్ ఫిలిం 'జిగార్తాండ' రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాను జనవరి 27 వ తేదీన లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ షేడ్స్ ఉన్న డాన్ పాత్రలో నటిస్తాడు. మరి సిద్ధార్థ్ పాత్రలో నటించే మరో హీరో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దర్శకుడు హరీష్ శంకర్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడా సినిమాలో తీయడంలో మంచి పట్టుంది. పైగా రీమేక్ సినిమాలో బెస్ట్ అని చెప్పుకునే 'గబ్బర్ సింగ్' కు దర్శకుడు కావడం తో ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు రూపొందిస్తాడని మనం ఆశించవచ్చు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయనాంక బోస్ ఈ సినిమాకు పనిచేస్తాడు. రామ్ ఆచంట.. గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు.