Begin typing your search above and press return to search.
రామ్, అనుష్క.. వెనక్కి తగ్గాల్సిందే!
By: Tupaki Desk | 3 Sep 2015 9:47 AM GMTముందు ఘనంగా రిలీజ్ డేట్ ఇచ్చేయడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గడం మన దర్శక నిర్మాతలకు కొత్తేమీ కాదు. ఒకే తేదీకి రెండు మూడు పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయంటే అందులో ఒకటి లేదా రెండు మాత్రమే చివరికి బరిలో నిలుస్తాయి. ఓపెనింగ్స్ అత్యంత కీలకమైన ఈ రోజుల్లో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తే ఇద్దరికీ కష్టమే. అందులో ఓ సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉందంటే.. రెండో సినిమా తప్పక వెనక్కి తగ్గాల్సిందే. లేకుంటే అసలుకే మోసం వచ్చేస్తుంది. అక్టోబరు 2న విడుదల కావాల్సిన సినిమాల విషయంలోనూ ఇదే జరిగేలా కనిపిస్తోంది. ఆ రోజు వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కంచె'తో పాటు రామ్ మూవీ 'శివమ్', అనుష్క సినిమా 'సైజ్ జీరో' విడుదల కావాల్సి ఉంది.
ఈ మూడు సినిమాల్లో ముందు నుంచి భారీ అంచనాలున్నది 'కంచె' మీదే. ఐతే తాజాగా ఆ సినిమా ట్రైలర్ చూశాక అంచనాలు రెట్టింపయ్యాయి. ఒక్కసారి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది ఈ సినిమాపై. టాలీవుడ్ లో ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ వచ్చిన దాఖలాలు లేకపోవడంతో సెలబ్రెటీల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు దీని కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తిని మరింత పెంచేలా మున్ముందు భారీ ప్రమోషన్ కూడా చేయబోతున్నారట. దీంతో సినిమా మీద క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో 'కంచె'తో పోటీ పడటం శివమ్, సైజ్ జీరో సినిమాలకు కష్టమే. కాబట్టి అప్పటి విడుదల తేదీకి దగ్గర్లో పరిస్థితి చూసుకుని రేసు నుంచి తప్పుకునే అవకాశాల్ని కొట్టి పారేయలేం. రెండూ కాకపోయినా.. ఒక్క సినిమా అయినా పోటీ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది.