Begin typing your search above and press return to search.

వీడియో: ముక్కు అంచుపై బొంగ‌రం తిప్పేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   30 May 2021 5:31 AM GMT
వీడియో: ముక్కు అంచుపై బొంగ‌రం తిప్పేస్తున్నాడు!
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. ఓవైపు ఘ‌ని చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే ఎఫ్ 3 ని ప్రారంభించాడు. ఇరు సినిమాల షెడ్యూల్స్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతుండ‌గానే సెకండ్ వేవ్ మొద‌లైంది. ఈ ప్ర‌భావంతో ప్ర‌స్తుత లాక్ డౌన్ లో వ‌రుణ్ ఇంట్లోనే గృహ‌నిర్భంధంలోకి వెళ్లాడు.

ఈ ఖాళీ స‌మ‌యాన్ని అత‌డు ఎలా స‌ద్వినియోగం చేస్తున్నాడు? అంటే.. వ‌రుణ్ తేజ్ ప్రాక్టీస్ చూస్తే మీరే చెప్పేస్తారు. తాజా ఇన్ స్టా వీడియోలో మెగా హీరో వరుణ్ తేజ్ స‌రికొత్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వరుణ్ నిన్న రాత్రి ఇన్ స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. తన ముక్కుపై కొన్ని సెకన్ల పాటు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు.

రెండో వేవ్ లో సినీ పరిశ్రమ స్థంబించింది. తిరిగి వరుణ్ తేజ్ తన సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో ఎప్ప‌టికి రీజాయిన్ అవుతారు? అన్న‌ది ఆరా తీస్తే.. జూన్ లేదా జూలైలో ఘని చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ ప్లానింగ్ పైనా అప్ డేట్ రావాల్సి ఉంది.