Begin typing your search above and press return to search.
లోఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు
By: Tupaki Desk | 23 Nov 2015 4:41 AM GMTహీరోల్ని మాస్ స్టయిల్ లో చూపించాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే. జీవితం అందరి దూల తీర్చేస్తుంది .. అని రగ్ డ్ గా మాట్లాడే పూరి తన సినిమాల్లో హీరోల్ని కూడా అంతే రఫ్ గా చూపిస్తాడు. ఇడియట్ లో రవితేజని - పోకిరిలో మహేష్ ని - దేశముదురులో బన్నిని - టెంపర్ లో ఎన్టీఆర్ ని తెరపై ఆవిష్కరించిన తీరు అసాధారణం. మాస్ అప్పియరెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని స్సెల్ బౌండ్ చేసేశాడు.ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని ఎలా చూపిస్తున్నాడు అన్న క్యూరియాసిటీతో ఉన్నారు.
వరుణ్ తేజ్ పూరి వదిలిన మాస్ బాణంలా ఉంటాడా? అన్నది డిస్కషన్ పాయింట్. ఇప్పటికే టీజర్ కి స్వల్పకాలంలో 10 లక్షల క్లిక్కులొచ్చాయి. అంటే అది పూరీపై అందరికీ ఉన్న గురి అలాంటిది. పూరి నుంచి ఓ మాస్ ఎంటర్ టైనర్ వస్తోంది అంటే జనాల్లో హై లెవల్ లో కాన్సన్ ట్రేషన్ ఉంటుంది. అయితే ఇంతకాలం అసలు లోఫర్ కి సంబంధించిన ఏ అప్ డేట్ చెప్పలేదు పూరి. ఎప్పుడు రిలీజ్ చేస్తాం? అన్నది చెప్పకుండా సైలెంటుగా కొత్త ప్రాజెక్టుల్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఎట్టకేలకు ఇప్పుడు లోఫర్ రిలీజ్ తేదీ డిసెంబర్ 18 అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.
అంటే ఏ పోటీ లేని టైమ్ చూసుకుని మరీ వదిలాడు. క్రిస్మస్ కానుకగా వేరే సినిమాలు రిలీజ్ లకు ఉన్నా ఒకవేళ లోఫర్ హిట్టయితే పండగ సెలవుల్ని కూడా క్యాష్ చేసుకునేలా డ్యూయెల్ ప్లాన్ చేశాడు పూరి. రిలీజ్ కంటే ముందే లోఫర్ పాటలపై హైప్ పెరిగింది కాబట్టి డిసెంబర్ 7న ఆడియోని రిలీజ్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశాడు. అదీ మ్యాటరు.