Begin typing your search above and press return to search.
హిందీకి వెళుతున్న లోఫర్!
By: Tupaki Desk | 24 Dec 2015 7:30 AM GMTజనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందేమో కానీ... పూరి జగన్నాథ్ కి మాత్రం తాను తీసిన లోఫర్ పిచ్చపిచ్చగా నచ్చేసినట్టుంది. అందుకే ఆ చిత్రాన్ని హిందీలోకీ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ విషయాన్ని తన సొంతూరైన నర్సీపట్నంలో స్వయంగా వెల్లడించాడు పూరి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి తీసిన లోఫర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్లాప్ టాకే వచ్చినా మెగా అభిమానుల అండదండలతో సినిమా మంచి వసూళ్లే రాబట్టుకుంది. అయితే పూరి నుంచి ఆశించిన సినిమా మాత్రం ఇది కాదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమయ్యాయి.
అయినా అలాంటి విమర్శల్ని పట్టించుకోకుండా సినిమాకి వసూళ్లు పెంచాలన్న ఉద్దేశంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలకి పూనుకుంది. అందులో భాగంగా సక్సెస్ టూర్ ని ప్లాన్ చేశాడు పూరి. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లని చుట్టొస్తున్నారు. క్రిస్ మస్ సినిమాలొచ్చేసరికి వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నర్సీపట్నం సక్సెస్ టూర్ లో పాల్గొన్న పూరి ప్రేక్షకులతో మాట్లాడుతూ లోఫర్ సినిమాని హిందీలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు. పూరి సినిమాలు హిందీకి వెళ్లడం కొత్తేమీ కాదు. పోకిరిలాంటి సినిమాలు అక్కడ రీమేక్ అయ్యాయి. బుడ్డా హోగా తేరాబాప్ లాంటి సినిమాతో స్వయంగా మంచి గుర్తింపును తెచ్చుకొన్నాడు పూరి. ఆ తర్వాత మళ్లీ హిందీ చిత్రం జోలికి వెళ్లలేదు. మరి లోఫర్ తో అక్కడ రెండో చిత్రం చేస్తాడేమో చూడాలి. మరి అందులో నాయకానాయికలుగా ఎవర్ని ఎంచుకొంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిషేక్ బచ్చన్ పూరితో కలిసి నటించేందుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వరుణ్ తేజ్ లాగే కనిపించే అభిషేక్ బచ్చనే హిందీ లోఫర్ కావొచ్చేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.