Begin typing your search above and press return to search.

నందమూరి హీరో సైడిస్తే మెగా హీరో వస్తాడట

By:  Tupaki Desk   |   6 Nov 2015 6:30 AM GMT
నందమూరి హీరో సైడిస్తే మెగా హీరో వస్తాడట
X
అక్కినేని నాగార్జున లాంటోళ్లు డిసెంబర్ నెల అంటే చాలా ఆసక్తి చూపిస్తారు కానీ.. మామూలుగా అయితే సినిమాలకు అది అన్ సీజన్ అని భావిస్తారు జనాలు. అందరి ఫోకస్ తర్వాత వచ్చే సంక్రాంతి మీదే ఉంటుంది తప్ప.. డిసెంబర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. పూరి జగన్నాథ్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడు. పోటీ లేకుండా డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడం కన్నా.. పోటీ ఉన్నా పర్వాలేదు సంక్రాంతికి తన కొత్త సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ తో అతను ఓ సినిమా తీసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. ముందు ‘లోఫర్’ అని.. ఆ తర్వాత ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అని పిలుచుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబరు 18న విడుదల అని ప్రకటించారు కూడా.

ఐతే డిసెంబరు అంటే అన్ సీజన్ అని.. ఈ నెలలో వచ్చి పెద్ద హిట్టయిన సినిమాలు చాలా తక్కువన్న ఉద్దేశంతో సంక్రాంతిని టార్గెట్ చేసింది పూరి టీమ్. ఐతే సంక్రాంతికి ఎంత పోటీ ఉంటుందన్న దాన్ని బట్టి వ్యూహాత్మకంగా అడుగు వేయబోతున్నారు. పండక్కి నందమూరి హీరోలు బాలయ్య - ఎన్టీఆర్ పోటీ పడతారని ముందు నుంచి భావిస్తున్నారు. ఐతే డిక్టేటర్ - నాన్నకు ప్రేమతో.. ఈ రెండూ వస్తాయా రావా అన్న డౌట్లు కొడుతున్నాయిప్పుడు. ఒక రోజు డిక్టేటర్ వాయిదా అంటున్నారు, ఇంకో రోజు నాన్నకు ప్రేమతో రాదంటున్నారు. ఐతే నందమూరి హీరోలు ఏదో ఒకటి తేలిస్తే దాన్ని బట్టి.. తమ సినిమాను సంక్రాంతికి తేవాలా డిసెంబరుకే ఫిక్స్ చేయాలా అన్నది పూరి తేల్చుకుంటాడు. నందమూరి హీరోల సినిమాల్లో ఒకటి సైడ్ అయితే పూరి-వరుణ్ ల సినిమా సంక్రాంతికి రావడం ఖాయం.