Begin typing your search above and press return to search.
ప్రయోగాలకు మెగా అడ్రెస్.. వరుణ్ తేజ్
By: Tupaki Desk | 24 Jun 2019 4:59 PM GMTమెగా ఫ్యామిలీలో ఉన్నంతమంది హీరోలు మరెక్కడా లేరనే సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు మెగా ఫ్యామిలీ హీరోలకు ఉన్న సక్సెస్ రేట్ టాలీవుడ్ లోనే కాదు .. ఏ ఇతర వుడ్ లోని ఫిల్మీ కుటుంబానికి కూడా లేదనడం అతిశయోక్తి కాదు. మెగా ఫ్యామిలీలో హీరోలందరి తారకమంత్రం ఒకటే అదే హార్డ్ వర్క్. మెగాస్టార్ నుంచి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న పంజా వైష్ణవ్ తేజ్ వరకూ ఎవరైనా కష్టపడాల్సిందే. కొత్త హీరోల విషయానికి వస్తే డ్యాన్సులు.. ఫైట్స్.. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాతే ఎంట్రీ. ఎలాంటి మెగా ఫ్యామిలీ మెంబర్ అయినా ఇవన్నీ పూర్తయిన తర్వాతే మెగా పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. కొందరు మెగా ఫ్యామిలీని బయట ఆఫ్ లైన్ సంభాషణలలో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్ అంటారు.. దీన్ని బట్టే హీరోల హార్డ్ వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు మాత్రమే ఎంచుకుంటారు.. ప్రయోగాల విషయంలో ఆమడ దూరంలో ఉంటారు అనేది మెగా ఫ్యామిలీ హీరోలపై ఉన్న ప్రధానమైన విమర్శ. ఒకవేళ ప్రయోగాలు చేసినా అది కూడా కమర్షియల్ ఫార్మాట్ చట్రానికి లోబడే ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం మెగా ఫ్యామిలీ కమర్షియల్ సూత్రాల పరిధి దాటి మరీ ప్రయోగాలు చేయడం ప్రేక్షకులనే కాదు.. మెగా ఫ్యాన్స్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదటి నుంచి మెగా హీరోలకు సహజంగా లభించే మాస్ ఇమేజ్ వెంట పడకుండా భిన్నమైన హీరోగా క్లాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. డిఫరెంట్ స్క్రిప్టులే కాకుండా భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను ప్రత్యేకంగా మలుచుకుంటున్నాడు వరుణ్.
ఒక దశలో ఈ ప్రయోగాలు వర్క్ అవుట్ కావని.. వరుణ్ తేజ్ మాస్ రూట్ కు రావల్సిందేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ డిఫరెంట్ సినిమాలు చేసిన సమయంలోనే వరుణ్ కు విజయాలు లభించాయి. 'కంచె' రెండవ ప్రపంచ యుద్ధం కాలం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. 'ఫిదా'లో హీరో కంటే హీరోయిన్ పాత్ర పవర్ఫుల్. 'ఎఫ్ 2' లో హవా వెంకటేష్ దే. అయినా 'ఎఫ్ 2' తెలంగాణా యాసలో మాట్లాడి కొత్తదనం పంచే ప్రయత్నం చేసి అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పటివరకూ చేసిన సినిమాలు.. పాత్రలు ఒక ఎత్తైతే 'వాల్మీకి' మరో ఎత్తు.
మెగా ఫ్యామిలీ ఒక హీరో నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర చేయడం చాలా అరుదు. అల్లు అర్జున్ 'ఆర్య 2' లో మాత్రం అలాంటి పాత్ర చేయడం జరిగింది. ఒక రగ్డ్ క్యారెక్టర్ విషయానికి వస్తే అల్లు అర్జున్ 'రుద్రమదేవి' గోన గన్నారెడ్డి పాత్ర.. 'రంగస్థలం' లో చరణ్ చిట్టిబాబు పాత్రలు మాత్రమే ఎక్సెప్షన్స్. కానీ 'వాల్మీకి'లో రగ్డ్ లుక్స్ తో పాటు నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్ర. సోమవారం విడుదలైన ప్రీ-టీజర్ తోనే ఒక్కసారిగా వరుణ్ అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ ప్రయోగంతో మరోసారి మెగా ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ హీరో అనే ప్రత్యేకతను వరుణ్ నిలబెట్టుకున్నాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వరుణ్ తేజ్ లాంటి హీరోలు మాస్ ఇమేజ్ వెంటపడకుండా ఇలా డిఫరెంట్ సినిమాలు చేసినప్పుడే రచయితలు.. దర్శకులు కొత్తదనంతో కూడిన కథలు తీసుకొస్తారు. అది పరిశ్రమకు మంచిదే.