Begin typing your search above and press return to search.
మెగా హీరోకి మాస్ మూవీ రెడీ
By: Tupaki Desk | 22 Jun 2018 4:49 AM GMTమెగా హీరోలు అందరూ మాస్ ఇమేజ్ ను పెంచుకునేందుకే ఉత్సాహం చూపుతారు. క్లాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. మాస్ సినిమాలు చేయడానికే ఇష్టపడతారు. కానీ ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాడు. తొలి చిత్రం ముకుంద నుంచి కంచెం.. ఫిదా.. తొలిప్రేమ.. ఇలా అన్నీ క్లాస్ సినిమాలే.
మధ్యలో లోఫర్ అంటూ ఓ మాస్ మూవీ కూడా చేశాడు కానీ ఇదేమీ అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం క్లాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ఈ హీరో.. ఇప్పుడు మాస్ ప్రేక్షకులపై కూడా దృష్టి పెట్టాడు. ఏ సెంటర్లతో పాటు బీ-సీ క్లాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించేందుకు వీలుగా ఓ స్టోరీ చేయాలని ఉత్సాహం చూపిస్తుండగా.. తాజాగా దర్శకుడు సాగర్ చంద్ర చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయ్యారే.. అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు వరుణ్ తేజ్ తో డిఫరెంట్ ఎలిమెంట్స్ తో మాస్ సినిమా చేయనున్నాడట.
ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. రీసెంట్ గా సమ్మోహనం మూవీతో మెప్పించిన బ్యూటీ అదితి రావు హైదరిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అంతరిక్షంలో ఈ భామ నటిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి పక్కా మాస్ మూవీతో ఆడియన్స్ ను అలరించనున్నారట.