Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ ముంబై వెళ్లింది అందుకేనా?

By:  Tupaki Desk   |   25 March 2023 10:11 PM GMT
వరుణ్ తేజ్ ముంబై వెళ్లింది అందుకేనా?
X
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి యానిమల్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమాని ఫైనల్ చేసుకున్న సంగతి తెలిసిందే. టి సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నారు.

దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిలను కూడా సందీప్ రెడ్డి వంగ లైన్ లో పెట్టడానికి స్టోరీలు రెడీ చేసుకున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముంబైలోని హకీమ్ హలీంలో సందీప్ రెడ్డి వంగతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి. అయితే సందీప్ రెడ్డి వంగని వరుణ్ తేజ్ ఇంత సడన్ గా కలవడం వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగతో ఏదైనా కథ చర్చలు జరిగాయా అనేది ప్రశ్నగా వినిపిస్తుంది.

వరుణ్ తేజ్ కూడా తన బ్రాండ్ ఇమేజ్ ను పాన్ ఇండియా లెవెల్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. అలాగే శక్తి ప్రతాప్ సింగ్ తో హిందీ, తెలుగు భాషలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల పైన భారీ అంచనాలు ఉన్నాయి. మరి సందీప్ రెడ్డితో వరుణ్ తేజ్ కలవడంలో ప్రత్యేకంగా సినిమా చర్చలకు సంబంధించి కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.