Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ప్రేమను వెతుక్కుంటూ.. మిస్టర్

By:  Tupaki Desk   |   31 Dec 2016 12:33 PM GMT
టీజర్ టాక్: ప్రేమను వెతుక్కుంటూ.. మిస్టర్
X
శ్రీనువైట్ల-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మిస్టర్ మూవీ మహా జోరు మీద ఉంది. న్యూ ఇయర్ కి వెల్కం చెప్పడం అంటూ.. చకచకా అప్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేయడం.. మరి కాసేపటికే టీజర్ ఇచ్చేయడం చూస్తుంటే.. శ్రీను వైట్ల అండ్ టీం ఏ రేంజ్ లో ప్రిపేర్డ్ ఉన్నారో అర్ధమవుతుంది.

క్యూట్ లవ్ స్టోరీ అయినా.. ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ అనిపించేలా టీజర్ కట్ చేసిన విధానం బాగుంది. మొదట స్పెయిన్ అందాలతో ప్రారంభించి మీరా(హేభా పటేల్)కు చైగా పరిచయం అవుతాడు హీరో. ఆ తర్వాత ఆ ప్రేమకు ఏ ఇబ్బందులు వచ్చాయో ఏమో తెలీదు కానీ.. ఎంచక్కా వచ్చి ఇండియాలో వాలిపోయాడు వరుణ్ తేజ్. తన హీరోయిన్ ని వెతుక్కునే క్రమంలో పరిచయమైన లావణ్య త్రిపాఠికి తన పిచ్చయ్య నాయుడు అని పరిచయం చేసుకుంటాడు హీరో. ఇక్కడి నుంచి ఇద్దరు హీరోయిన్ల మధ్య హీరో స్ట్రగుల్.

టీజర్ లో వైట్ల చెప్పిన విషయం అయితే ఇదే. కానీ.. భారీతనంతో కాకుండా ప్రతీ ఫ్రేమ్ ని కట్టిపడేసేలా తెరకెక్కించిన విధానం అయితే సూపర్ అనాల్సిందే. స్పెయిన్ అందాల నుంచి.. ఊటీ వరకూ ప్రతీ ఫ్రేమ్ ను ఎంపిక చేసుకున్న విధానం.. విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం. చాలాకాలం తర్వాత శ్రీనువైట్ల నుంచి ఓ ఫీల్ బేస్డ్ మూవీ వస్తోందనే విషయం.. మిస్టర్ టీజర్ తో అర్ధమవుతుంది.