Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: కూల్ మిస్టర్ వచ్చేశాడు
By: Tupaki Desk | 31 Dec 2016 10:18 AM GMTఅరంగేట్రం చేసిన వెంటనే.. కేవలం ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఓ రేంజ్ లో హంగామా చేశాడు. ముకుంద.. కంచె.. లోఫర్ చిత్రాలన్నీ సంవత్సరం(365 రోజులు)లోపే విడుదలైపోయాయి. ఆ తర్వాత స్లో అయిపోయిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. కాసింత లేట్ గా అయినా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్లతో మూవీ మొదలుపెట్టాడు.
మిస్టర్ మూవీని ఏప్రిల్ లో అనౌన్స్ చేయగా.. ఫారిన్ షూటింగ్ కి వీసా అనుమతుల కారణంగా ఓసారి.. వరుణ్ తేజ్ కి గాయం కావడంతో మరోసారి లేట్ అయింది. ఇప్పుడు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మిస్టర్ ఫస్ట్ లుక్ ఇచ్చాడు దర్శకుడు శ్రీనువైట్ల. వరుణ్ తేజ్ లుక్ ని ఫుల్లుగా మార్చేసి.. క్లాస్ టచ్ తో మాస్ హీరోగా చూపించాడు దర్శకుడు. ఎక్కువ భాగం స్పెయిన్ లో షూట్ చేయడం.. ఆ తర్వాత ఊటీలో షెడ్యుల్ చేసిన మిస్టర్ టీం.. రెండు లొకేషన్స్ కు సంబంధించిన చిత్రాలను ఫస్ట్ లుక్ లో చేర్చారు. సఫైర్ బ్లూ థీమ్ తో చేసిన డిజైన్స్ అయితే అదిరిపోయాయంతే.
మరో లుక్ లో అయితే గన్నీ బ్యాగ్స్ మధ్యలో సైలెంట్ గా కూర్చున్న మిస్టర్ వరుణ్ తేజ్ లుక్ ఇచ్చాడు శ్రీనువైట్ల. బ్లూ జీన్స్.. బ్లూడ్రస్.. సఫైర్ బ్లూ థీమ్.. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. ఈ మూటల్లో ఏముందో లీడ్ కూడా ఇవ్వకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/