Begin typing your search above and press return to search.
మెగా కుర్రాడు.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?
By: Tupaki Desk | 23 Feb 2016 11:30 AM GMTకెరీర్ ఆరంభంలో ఏ యువ కథానాయకుడూ చేయని సాహసాలు చేశాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన కొత్త కుర్రాడు ‘ముకుంద’ లాంటి సినిమాతో అరంగేట్రం చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. అదే చిత్రమైతే.. ఆ తర్వాత ‘కంచె’ లాంటి మరో రిస్కీ ప్రాజెక్టులో నటించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు వరుణ్. ఈ రెండు సినిమాలూ కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. వరుణ్ మాత్రం మంచి పేరే సంపాదించాడు. ఐతే ఎప్పుడూ ఇలాంటి సినిమాలే ఏం చేస్తాంలే అని.. మాస్ ఇమేజ్ తెచ్చుకునే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లోఫర్’ చేశాడు వరుణ్. ఐతే ఆ సినిమాతో అతను కోరుకున్న ఇమేజ్ రాకపోగా.. ఉన్న పేరు కూడా పోయింది. రెంటికీ చెడ్డట్లు తయారైంది పరిస్థితి.
దీంతో మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయి క్రిష్ దర్శకత్వంలోనే ‘రాయబారి’ చేయాలనుకున్నాడు వరుణ్. అదే సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీని కూడా లైన్లో పెట్టాడు. ఐతే ఇప్పుడు రాయబారి ఆగిపోయింది. మలినేని సినిమా పక్కకు వెళ్లిపోయింది. శ్రీను వైట్ల సినిమా తెరమీదికి వచ్చింది. ఐతే ఈ సినిమా వరుణ్ కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందా అన్నది సందేహంగా మారింది. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎలా ఉందో చూసుకోకుండా ‘లోఫర్’ చేసి దెబ్బ తిన్న వరుణ్.. ఆగడు - బ్రూస్ లీ లాంటి సినిమాలతో బోల్తా కొట్టిన వైట్లతో పని చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలే తన కెరీర్ అటు ఇటుగా ఉన్నపుడు.. వరుణ్ ఇలాంటి సాహసం చేయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.