Begin typing your search above and press return to search.

ఫ్లాపుల వైట్లకి మెగా క్యాంప్‌ డేటిచ్చింది

By:  Tupaki Desk   |   4 March 2016 3:30 PM GMT
ఫ్లాపుల వైట్లకి మెగా క్యాంప్‌ డేటిచ్చింది
X
వరుస ఫ్లాపుల తర్వాత బాగా డల్ అయిన శ్రీను వైట్ల.. ఎట్టకేలకు కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. బ్రూస్ లీ అంటూ మెగా పవర్ స్టార్ కు ఫ్లాప్ మూవీ ఇచ్చినా.. మళ్లీ మెగా క్యాంప్ నుంచే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు.

బ్రూస్ తర్వాత దాదాపు ఐదు నెలలుగా కొత్త ప్రాజెక్టుపై వర్క్ చేసిన వైట్ల.. ఎట్టకేలకు వరుణ్ తేజ్ సినిమాని ఫైనల్ చేసుకుని.. ఏప్రిల్ 8న స్టార్ట్ చేయనున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా ఆ రోజున ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట. అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కూడా ఉండడంతో.. మరో మెగా మూవీ కూడా ఫ్యాన్స్ లోకి ఈజీగా వెళ్తుందని ఆలోచించారట యూనిట్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు స్కోప్ ఉండగా.. ప్రస్తుతానికి ఎవరినీ ఫైనల్ చేయలేదు. అయితే.. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు కొత్త హీరోయిన్లను సంప్రదించారని, డేట్స్ అడ్జస్ట్ అయ్యాక అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు వరుణ్ తేజ్-శ్రీనువైట్ల చిత్రాన్ని నిర్మించనున్నారు. కంచెతో ట్యాలెంటెడ్ హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్.. లోఫర్ ప్లాప్ అయ్యాక చాలానే గ్యాప్ తీసుకున్నాడు. క్రిష్ రాయబారి కోసం గెటప్ కూడా ఛేంజ్ చేసుకున్న వరుణ్.. ఇప్పుడు వైట్ల సినిమాలో కొత్తలుక్ తో దర్శనమిస్తాడట.