Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ గేర్ మార్చాల్సిందే బాసు..!
By: Tupaki Desk | 6 Jan 2023 5:32 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో వేగం తగ్గించాడు. కొందరు హీరోలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తారు కానీ వరుణ్ తేజ్ మాత్రం అలా కాకుండా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న గని ఫ్లాప్ అవగా F3 ఒక మోస్తారుగా ఆడేసింది. అయితే ఈ రెండు సినిమాల వల్ల వరుణ్ తేజ్ కి పెద్దగా ఉపయోగపడ్డది ఏమి లేదు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాగా వస్తుంది.
ముకుంద నుంచి F3 వరకు నటుడిగా వరుణ్ తేజ్ మంచి మార్కులు సంపాదించినా సరే మెగా హీరోగా కెరీర్ లో దూకుడు చూపించాల్సిన అతను ఇలా వెనకబడటం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. వెనకాల మెగా ఫ్యాన్స్ అండదండలు ఉన్నా సరే వరుణ్ తేజ్ ఈ వెనకడుగు వేయడానికి గల కారణాలు ఏంటో అర్థం కావట్లేదు. వరుణ్ తేజ్ కథల జడ్జ్ మెంట్ విషయంలో కొద్దిగా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. ఏ కథ తనకు పర్ఫెక్ట్ అనిపిస్తుందో అలాంటి సినిమాలే చేయాలి. అంతేకాదు కథలో తన క్యారెక్టరైజేషన్ మీద కూడా వరుణ్ తేజ్ దృష్టి పెట్టాల్సి ఉంది.
తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలడు అన్నది గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. కాబట్టి కథల విషయంలో సేఫ్ సైడ్ గా కాకుండా రిస్క్ చేస్తేనే కెరీర్ బాగుంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్.
మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎలాగు ఉంటుంది కాబట్టి వరుణ్ తేజ్ ప్రయోగాలు చేస్తేనే బెటర్ అని అంటున్నారు. గేర్ మార్చి స్పీడ్ పెంచకపోతే వరుణ్ తేజ్ ఇంకా కెరీర్ లో వెనకపడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి వరుణ్ తేజ్ ఇక మీదట అయినా కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెడితే బెటర్.
వరుణ్ తేజ్ 13వ సినిమాలో పైలట్ గా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే.. అయితే డిఫరెంట్ కథలతో రావడం ఓకే కానీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం వెనకపడ్డాడు మెగా ప్రిన్స్.
ఇదే కొనసాగితే మాత్రం వరుణ్ తేజ్ కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. అందుకే సినిమాల వేగం పెంచి ఏడాదికి కుదిరితే రెండు లేదా ఒక సినిమాతో అయినా ప్రేక్షకులను అలరించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.