Begin typing your search above and press return to search.
నిహారిక పనిలో మేమెప్పుడూ జోక్యం చేసుకోలేదు
By: Tupaki Desk | 12 Nov 2021 6:12 AM GMTనిహారిక కొణిదెల కొంత గ్యాప్ తరువాత నిర్మించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. సంగీత్ శోభన్ .. సిమ్రాన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ లో, నరేశ్ - తులసి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జీ 5లో ఈ వెబ్ సిరీస్ ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. "చాలా రోజుల తరువాత ఒక ఫంక్షన్ లో మాట్లాడుతున్నాను. మీ అందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.
"నిహారిక నాకు ఒక ఏడాది క్రితం చెప్పింది .. ఇలా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానని. కానీ కథ ఏమిటి? టైటిల్ ఏమిటి? అని ఏమీ చెప్పలేదు. ఎప్పుడూ కూడా మేము తన పనిలో జోక్యం చేసుకుని .. ఇది చేయి .. అది చేయి అని చెప్పలేదు. తనకి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలుసు. అంతా అయిన తరువాత చూసి బాగుందా లేదా చెబుతామంతే. అలాగే ఈ వెబ్ సిరీస్ టీజర్ ను తాను చూపించినప్పుడు షాక్ అయ్యాను. నేనే కాదు అందరూ అంటున్నారు .. సినిమా క్వాలిటీతో ఉందని. ఇక పోను పోను సినిమాకి .. ఓటీటీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కంటెంట్ బాగుంటే చాలు.
ఒక సినిమా వలన చాలామందికి అవకాశాలు వస్తాయి. అలాగే ఓటీటీ వలన కూడా చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. నిజంగా ఓటీటీ అనేది చాలా పెద్ద ఫ్లాట్ ఫామ్. సంగీత్ చాలా బాగా చేశాడు .. ఇంతకుముందు మంచి అనుభవం ఉన్నవాడిలా చేశాడు. సినిమాలు ఏమైనా చేశాడా? అని కూడా నేను నిహారికను అడిగాను. ఆయన టైమింగ్ చాలా బాగుంది .. నిజంగా నాకు బాగా నచ్చింది .. మంచి భవిష్యత్తు ఉంది. సిమ్రాన్ కూడా చాలా బాగా చేసింది .. ఆమెకి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. నరేశ్ గారు నాకు బాగా తెలుసు .. ఇంతకుముందు ఆయనతో సినిమాలు చేశాను.
ఎలాంటి పాత్రలనైనా నరేశ్ గారు చాలా గొప్పగా చేస్తారు. అలాంటి నరేశ్ గారు సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీలో చేయడమనేది న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం వంటిదే. ఈ సందర్భంగా నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు మహేశ్ గురించి ఈ 19 తరువాత అంతా మాట్లాడుకుంటారు. ఈ వెబ్ సిరీస్ కి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీ .. కెమెరామెన్ కి .. ఎడిటర్ కి అభినందలు తెలియజేస్తున్నాను. ఈ నెల 19 నుంచి మీ అందరూ కూడా మీ ఫ్యామిలీతో కూర్చుని ఈ ఫ్యామిలీ స్టోరీని చూస్తూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.