Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ లుక్.. రాయబారి కోసమా?

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:35 PM GMT
మెగా ప్రిన్స్ లుక్.. రాయబారి కోసమా?
X
వరుణ్ తేజ్ - దిశా పటానీ జంటగా నటించిన లోఫర్ ఆడియో వేడుకకు వేదిక హైద్రాబాద్ లోని శిల్పకళా వేదిక. ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ కార్యక్రమంలో.. హీరో వరుణ్ తేజ్ స్పెషల్ అట్రాక్షన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఈ ఫంక్షన్ లో మెగా ప్రిన్స్ గెటప్ భలే డిఫరెంట్ గా ఉంది.

పెద్ద మీదం - గెడ్డం రాయల్ గా కనిపిస్తున్నాడు నాగబాబు తనయుడు. అయితే.. ఇది కంచె లుక్ కాదు. ఆ తర్వాత లోఫర్ లోనూ వరుణ్ తేజ్ ఇలా కనిపించలేదు. పూరీ మూవీలో రఫ్ లుక్ తో ఇరగదీశాడు. మరి ఇప్పుడు ఇంత గుబురు మీసం ఎందుకు అనే ప్రశ్న తలెత్తడం సహజం. వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ కోసమే ఇలా గెటప్ ఛేంజ్ చేసుకున్నాడని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

వరుణ్ తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్టులలో క్రిష్ తీయబోతున్న మూవీ కూడా ఒకటి అని ఇంతకుముందే చెప్పుకున్నాం. దిల్ రాజు ప్రొడక్షన్ లో రాయబారి అనే పవర్ ఫుల్ టైటిల్ తో క్రిష్ ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే వరుణ్ కి చెప్పడం, ఓకే చేసేయడం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ లుక్ చూస్తుంటే.. ఇమ్మీడియెట్ గా స్టార్ట్ చేయనున్న సినిమా రాయబారి అని ఫిక్స్ అయిపోవచ్చు.