Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ కొత్త బొమ్మ చూశారా?

By:  Tupaki Desk   |   20 Feb 2018 1:38 PM GMT
వరుణ్ తేజ్ కొత్త బొమ్మ చూశారా?
X
మెగా హీరోలు అందరిలో వరుణ్ తేజ్ ఈ మధ్య చాలా డిఫరెంట్ సినిమాలు తీస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ముకుంద లో ఒక జాబ్ లేని ఇంజనీరింగ్ స్టూడెంట్ లా కనిపించాడో లేదో కంచె లో సైనికుడి లా మన ముందుకు వచ్చేశాడు. ఫిదా లో అమెరికా నుండి వచ్చిన డాక్టర్ లా కనిపించి తొలి ప్రేమ లాంటి ప్రేమకథ తో లవర్ బాయ్ అయిపోయాడు.

ఇలాంటి వరుణ్ ఇపుడు ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరిలోనూ కుతూహలం ఉంది. అందరి ఆలోచనలకు తెర దించుతూ ఈ మెగా హీరో రాబోయే సినిమా ఘాజి ఫేమ్ సంకల్ప రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుందని వార్త బయటకి వచ్చేసింది. ఇందులో ఎప్పుడు లేని విధంగా వరుణ్ ఒక ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) లా కనిపించబోతున్నాడు. సినిమా కోసం జీరో గ్రావిటీ లో ఎలా ఉండాలో శిక్షణ తీస్కోవటానికై కజకస్థాన్ కూడా వెళ్లబోతున్నాడు. కాగా వరుణ్ ఈమధ్యనే కొనుక్కున్న ఒక బొమ్మ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒక వ్యోమగామి బొమ్మను కొని దాని ఫోటో ను సోషల్ మీడియా లో నా కొత్త బొమ్మ అంటూ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఇది వ్యోమగమిగా కనిపించేందుకు ఇన్ స్పిరేషన్ ఆ అంటూ ఫాన్స్ అడుగుతున్నారు. ఘాజి లాంటి అద్భుతమైన సినిమా చేసిన చేసిన డైరెక్టర్ తో ఇలాంటి స్క్రిప్ట్ తో సినిమా తీయాలంటే ఆ మాత్రం ఇన్ స్పిరేషన్ కావాల్సిందే అంటారా?