Begin typing your search above and press return to search.

హీరోయిజం ఎప్పుడు చూపిస్తావ్?

By:  Tupaki Desk   |   23 Oct 2015 5:30 PM GMT
హీరోయిజం ఎప్పుడు చూపిస్తావ్?
X
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ యాక్టర్‌ గా ప్రూవ్‌ చేసుకున్నాడు. మొదటి మూవీ ముకుందలో పెర్ఫామెన్స్ పరంగా కొన్ని విమర్శలు వచ్చాయి. వీటన్నిటికి కంచెతో కంచె వేసేశాడు వరుణ్ తేజ్. యాక్టర్ గా తనేంటో రెండు వేరియన్స్ ఉన్న కేరక్టర్ తో ప్రూవ్ చేసేసుకున్నాడు.

సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచీ వచ్చే హీరోలకు భిన్నంగా ఉంది వరుణ్ తేజ్ జర్నీ. ప్రయోగాత్మక చిత్రాలతో తనదంటూ స్పెషల్ స్టాంప్ వేసుకుంటున్నాడు. కంచెలాంటి మూవీ చేయడం జీవితంలో ఒకేసారి వచ్చే ఛాన్స్ లాంటిది కాబట్టి ఓకే. కానీ మెగా వారసుడు నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసేవి వేరే ఉంటాయి.

మెగా ఫ్యాన్స్ ని అలరించాలంటే డ్యాన్సులు చేయాలి, ఫైట్స్ ఇరగదీయాలి. అంటే కమర్షియల్‌ హీరోయిజం చూపించాలన్న మాట. కానీ వరుణ్ తేజ్ ఇప్పటివరకూ అలాంటేవీమీ చూపించలేదు. ఒడ్డూ పొడుగు బాగుంటాడు.. మెగా ఫ్యామిలీ హీరోలందరిలోకీ అందగాడు.. అయినా సరే హీరోయిజం ఎలివేట్ చేసేలా కనిపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కనీసం.. పూరీ తీస్తున్న మా అమ్మ మహాలక్ష్మిలో అయినా.. మాస్ మార్క్ వేస్తాడో లేదో..