Begin typing your search above and press return to search.
కొత్త రూటులో మెగా ప్రిన్స్
By: Tupaki Desk | 23 Dec 2018 6:23 AM GMTకెరీర్ లో తొలి సక్సెస్ ను అందుకోవడానికి కాస్త టైం పట్టినప్పటికీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా నుంచి సరైన దారిలో వెళ్తున్నాడు. తొలిప్రేమతో ఈ ఏడాది మొదటి సక్సెస్ ను అందుకుని హ్యాట్రిక్ కోసం అంతరిక్షం రూపంలో బాగా కష్టపడ్డాడు. కమర్షియల్ గా అంతరిక్షం ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది పక్కన పెడితే టాలీవుడ్ లో జరిగిన అరుదైన ప్రయత్నంలో ఒక భాగం కావడం పట్ల మాత్రం వరుణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి జానర్లు అందరు చేసేవి కాదు. ఇదే ధోరణిని ఇకపై కూడా కొనసాగించేలా ఉన్నాడు వరుణ్.
కొత్త సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ కొర్రపాటి చెప్పిన లైన్ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కిరణ్ గతంలో శీను వైట్లతో మిస్టర్ చేసినప్పటి నుంచి వరుణ్ తో పరిచయం ఉంది. ఒకరకంగా మాస్ చక్రబంధంలో ఇరుక్కోవడం వరుణ్ కు ఇష్టం లేనట్టుంది. పైగా ఆ జానర్ తనకు సూట్ కాదని లోఫర్-మిస్టర్ రెండు సినిమాలు రుజువు చేసాయి. అందుకే మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేయడం కన్నా తనను తాను భిన్నమైన హీరోగా ప్రూవ్ చేసుకోవడం మీదే వరుణ్ తేజ్ ఫోకస్ పెడుతున్నాడు.
తమిళ్ లో విజయ్ సేతుపతి ఎలాగైతే ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలతో దూసుకుపోతున్నాడో వరుణ్ కూడా అదే తరహాలో మెగా కాంపౌండ్ లో డిఫరెంట్ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళ్ హిట్ జిగర్ తాండా రీమేక్ కూడా పరిశీలనలో ఉన్నట్టు మొన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మూసలో వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న వరుణ్ కు హిట్లు ఇలాగే కొనసాగితే ప్రత్యేకమైన గుర్తింపుతో నిలవడం ఖాయం