Begin typing your search above and press return to search.
ఊర మాస్ లుంగీ రాజాని!
By: Tupaki Desk | 20 Dec 2018 3:30 PM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనగానే క్లాస్ సినిమాలే చేస్తాడని భావిస్తారు. కంచె నుంచి ప్రయోగాల బాటలోనే ఉన్నారని అంతా భివిస్తారు. అయితే ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే వరుణ్ తేజ్ మాట వేరొకలా ఉంది. అందరూ అలా అనుకుంటున్నారు. కానీ నేను కూడా ఫిదా - తొలి ప్రేమ లాంటి రెగ్యులర్ ప్రేమకథలు కూడా చేశాను కదా? కంచె ప్రయోగం - అంతరిక్షం ప్రయోగమే కానీ రెగ్యులర్ లవ్ స్టోరిలు చేశాను అని అన్నారు. అంతరిక్షం ఈనెల 21న రిలీజవుతున్న సందర్భంగా సంస్థ కార్యాలయంలో మాట్లాడిన వరుణ్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు.
వరుణ్ తేజ్ తాను నటిస్తున్న తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది. ఆ సినిమాలో పూర్తి మాస్ అవతారంలో కనిపిస్తాను. ఊర మాస్ లుంగీ బోయ్ లా కనిపిస్తాను. అసలు ఇంట్రడక్షనే లుంగీ కట్టుతో దుమారం రేపుతుంది. అమ్మాయి - అబ్బాయి మధ్య లవ్ లో సంఘర్షణ - పెళ్లయిన జంట మధ్య సంఘర్షణ అద్భుతంగా కుదిరింది. నేను దర్శకులు చెప్పినట్టు చేస్తాను. ఇన్ని రకాల పాత్రల్లో చేయడానికి కారణం వాళ్లే. అనీల్ రావిపూడి ఊర మాస్ గా చూపించారు... అని తెలిపారు.
పెళ్లాం ఊరెళితే తరహా జోనర్ అయినా ఇందులో పాత్రలు - సన్నివేశాలు పూర్తిగా కొత్త అనుభూతిని పంచేవే. ఆ తరహా జోనర్ కూడా వచ్చి చాలా కాలమే అయ్యింది. అందుకే ఎఫ్ 2 బాగా కుదిరిందనే అనుకుంటున్నా. ఇక ఈ చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడే కుర్రాడిగా నటిస్తున్నా. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పెరిగాను. తెలంగాణ లోకల్ ఫ్రెండ్స్ వల్ల ఆ యాసపై పట్టుంది. ఎఫ్2 పెద్ద స్కేల్ లో ఉండే సినిమా అని వరుణ్ తెలిపారు.