Begin typing your search above and press return to search.

వ‌రుణ్ తేజ్ నెక్ట్స్‌ సినిమా పేరేంటంటే...

By:  Tupaki Desk   |   19 Feb 2018 10:19 AM GMT
వ‌రుణ్ తేజ్ నెక్ట్స్‌ సినిమా పేరేంటంటే...
X
మెగా హీరోల్లో ఖుషీగా ఉన్న‌ది వ‌రుణ్ తేజే. వ‌రుస‌పెట్టి విజ‌యాలు అందుకున్నాడు. మొన్న ఫిదా... నేడు తొలిప్రేమ‌. అందుకే ఫుల్ జోష్ మీద త‌న త‌రువాతి సినిమా చేయ‌బోతున్నాడు. వ‌రుణ్ సినిమాకు ఒక వెరైటీ టైటిల్ అనుకున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగు నుంచి సంస్కృతంలోకి వెళ్లిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది మ‌న టాలీవుడ్.

వ‌రుణ్ తేజ్ బాగానే క‌థ‌లు ఎంపిక చేసుకున్న‌ట్టు అనిపిస్తోంది... సినీ జ‌నాల‌కు. ఎందుకంటే ఫిదా అమెరికా నుంచి వ‌చ్చిన కుర్రాడి క‌థ‌. ఇక తొలిప్రేమ‌... ఏడేళ్ల ల‌వ్ జ‌ర్నీ. రెండింటిలోనూ సున్నితంగా న‌టించి మంచి మార్కులే కొట్టేశాడు వ‌రుణ్‌. ఇదిగో మ‌రో వెరైటీ స్క్రిప్ట్ కూడా అత‌ని కోసం సిద్ధ‌మైపోయింది. ఇందులో ఆస్ట్రోనాట్‌ గా క‌నిపించబోతున్నాడ‌ట వ‌రుణ్. ఘాజీ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి దీని ద‌ర్శ‌కుడు. ఇంత‌కీ ఈ సినిమాకు ఏ పేరు పెట్టారో తెలుసా? అహం బ్ర‌హ్మ‌స్మి. అవునండీ... ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ... ఇదే టైటిల్ ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో చిత్ర‌యూనిట్ టైటిల్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

వ‌రుణ్ అహం బ్ర‌హ్మ‌స్మి సినిమా కోసం భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేశాడ‌ట‌. ఇంత‌వ‌ర‌కు రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు తీసుకున్న వ‌రుణ్‌... ఇప్పటి నుంచి నాలుగు కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం అన్నివిధాలుగా సిద్ధ‌మ‌వుతున్నాడు మెగాహీరో. ద‌ర్శ‌కుడితో కలిసి క‌జ‌కిస్తాన్ వెళ్లి అక్క‌డ నెల రోజుల పాటూ జీరో గ్రావిటీలో ఎలా ఉంటారో శిక్ష‌ణ తీసుకోబోతున్నాడ‌ట‌.