Begin typing your search above and press return to search.
డాన్ రోల్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాడట
By: Tupaki Desk | 9 Jan 2019 1:30 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఒక నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. 'అంతరిక్షం' డిసెంబర్ 21న రిలీజ్ కాగా 'ఎఫ్ 2' జనవరి 12 వ తారీఖున విడుదల అవుతోంది. వరుణ్ ప్రస్తుతం 'ఎఫ్2' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అలాంటి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.
తమిళ సూపర్ హిట్ ఫిలిం 'జిగార్తాండ'(2014) రీమేక్ లో వరుణ్ తేజ్ నెగెటివ్ రోల్ పోషించేందుకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఈమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో హీరో గా సిద్దార్థ్ నటించగా విలన్ గా డాన్ పాత్రలో బాబీ సింహా నటించాడు. ఈ సినిమాను తెలుగు డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్ బాబీ సింహా పాత్ర కోసం వరుణ్ ను సంప్రదించాడని అన్నారు. ఈ విషయంపై వరుణ్ మాట్లాడుతూ.. 'జిగార్తాండ' రీమేక్ కోసం తనను సంప్రదించిన విషయం నిజమేనన్నాడు. తనకు ఆ సినిమా చాలా నచ్చిందని.. కాకపోతే ఇంకా రీమేక్ కోసం సైన్ చేయలేదని అన్నాడు. త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
'ఎఫ్ 2' గురించి మాట్లాడుతూ వెంకటేష్ గారితో నటించడం ఒక మంచి అనుభవం అని.. ఆయనతో కలిసి పని చేసినందువల్ల తన కామెడీ టైమింగ్ మెరుగైందని అన్నాడు. అయన చాలా కూల్ గా ఉంటారని.. షూటింగ్ సమయంలో ఫుల్ గా ఎంజాయ్ చేశామని తెలిపాడు. మరి సంక్రాంతి తోడల్లుళ్ళు స్క్రీన్ పై ఎలాంటి హంగామా చేశారో తెలియాలంటే మనం 12 వ తేదీ వరకూ వేచి చూడాలి.