Begin typing your search above and press return to search.
వాల్మీకికి అవే ఇన్స్ పిరేషన్ అంటున్న వరుణ్
By: Tupaki Desk | 15 Sep 2019 4:39 AM GMTగ్యాంగ్ లీడర్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం రాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద పడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ బ్లాక్ బస్టర్ జిగర్ తండా రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరొయిన్ గా నటించగా కోలీవుడ్ హీరో అధర్వ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే దీని రన్ టైంని 2 గంటల 51 నిమిషాలకు లాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఒరిజినల్ వెర్షన్ కన్నా పది నిముషాలు ఎక్కువ పొడిగించడం విని అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ వరుణ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కూల్ గా ఉన్నాడు. ప్రేక్షకులను సరిగ్గా ఎంటర్ టైన్ చేస్తే ఎంత నిడివి ఉన్నా చూస్తారని దానికి ఉదాహరణగా అర్జున్ రెడ్డి - మహానటి - రంగస్థలం లాంటి సినిమాలను ఉదహరించాడు. లగాన్ నాలుగు గంటలకు దగ్గరగా ఉన్నా అప్పట్లో రెండు ఇంటర్వెల్స్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ఇదంతా బాగానే ఉంది వరుణ్ తేజ్ చెప్పిన ఉదాహరణలు అన్ని ఆయా భాషల్లో స్ట్రెయిట్ సబ్జెక్ట్స్ తో రూపొందిన సినిమాలు. కానీ వాల్మీకి పక్కా రీమేక్. అందులోనూ వరుణ్ తేజ్ చేసింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్. హరీష్ శంకర్ మార్పులు చేయడంలో దిట్ట. గబ్బర్ సింగ్ తరహా మేజిక్ మరోసారి రిపీట్ చేస్తాడని మెగా ఫాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.
సైరాకు రెండు వారాల ముందు వస్తున్న వాల్మీకితో సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు కావాలనిఎదురు చూస్తున్నారు. ఇవాళ వెంకటేష్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఇప్పటికే మిక్కీ జె మేయర్ ఆల్బమ్ మాస్ లో బాగానే రీచ్ అయ్యింది. మరి అసలు అంచనాలు అందుకోవడంలో వాల్మీకి సక్సెస్ అవుతాడా లేదా 20న తేలిపోతుంది