Begin typing your search above and press return to search.

వాల్మీకిలో ఆ ఎమోషన్ ఉంటుందా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 1:30 AM GMT
వాల్మీకిలో ఆ ఎమోషన్ ఉంటుందా?
X
రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ వాల్మీకికి సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్2 రూపంలో ఓ ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అందులో వెంకటేష్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి గట్టి సోలో హిట్ పడాలని వరుణ్ తేజ్ దీని మీద చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. స్ట్రెయిట్ సబ్జెక్టు అయితే అనుమానించదానికి అవకాశం లేదు కాని రీమేక్ కావడం వల్లే లేనిపోని సందేహాలన్నీ వస్తున్నాయి.

ఒరిజినల్ తమిళ్ వెర్షన్ జిగర్ తండాలో క్లైమాక్స్ పోర్షన్ చాలా కీలకం. అక్కడ దాకా ఒక టెంపో మైంటైన్ చేసిన దర్శకుడు చివర్లో సెకండ్ హీరో పాత్ర ద్వారా మెయిన్ హీరో కం విలన్ (ఇప్పుడు వరుణ్ చేసిన పాత్ర) ను ఫూల్ చేయిస్తాడు. ఇది బాగా పేలింది. మంచి ఎమోషన్ ఉండటంతో జనం కనెక్ట్ అయ్యారు. అప్పటికి బాబీ సింహకు అది రెండో మూవీ. కాబట్టి ఇమేజ్ లాంటి ప్రతిబంధకాలు ఏమి లేకపోవడంతో సాఫీగా బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టింది. కానీ దాన్ని యథాతథంగా వాల్మీకిలో రిపీట్ చేసుంటారా అనేదే ఇప్పుడు అసలు పాయింట్.

ఫ్లేవర్ చెడిపోకూడదు అనుకుంటే అది అలాగే తీయాలి. కానీ వరుణ్ తేజ్ ది బాబీ సింహ లాంటి బిగినింగ్ ఇమేజ్ కాదు. ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. హరీష్ శంకర్ ఒకవేళ ఆ కీలకమైన మార్పు కనక చేసుంటే ఎంతమేరకు అభిమానులు ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా తీసుంటారు అనేదాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ నెల 20న వాల్మీకి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీజే తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ ఇది సవాల్ గా నిలుస్తోంది