Begin typing your search above and press return to search.

అతి పెద్ద చిరు150 కోసం సిద్దమా??

By:  Tupaki Desk   |   26 April 2016 10:44 AM GMT
అతి పెద్ద చిరు150 కోసం సిద్దమా??
X
అదండీ మన వరుణ్‌ తేజ్‌ వరుస. ఒక ప్రక్కన తన సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తుంటే.. తను మాత్రం ముందుగా డాడీ (పెదనాన్నను అలా పిలుస్తాడులే) మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురుచూస్తున్నాడంట.

అయితే మనోడు ఈరోజు చిరుతో కలసి ఒక ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు. అక్కడికి వెళ్లినోడు ఊరికే ఉన్నాడా.. స్వయంగా చిరంజీవితో కలసి 1..5..0 అంటూ వేళ్లతో సంకేతాలు ఇస్తూ ఒక ఫోటో తియించాడు. దానిని ఆన్‌ లైన్‌ లో పెట్టేసి.. చిరంజీవి 150 చాలా పెద్దగా రాబోతుంది.. దాని కోసం మీరు సిద్దమవ్వండే అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్‌. ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కాని.. ఈ గెస్చర్‌ మాత్రం అదిరింది. కత్తిలాంటి ప్రమోషన్‌ ఇది.

ఇక తమిళంలో హిట్టయిన 'కత్తి' సినిమాను తెలుగులో వివి వినాయక్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.