Begin typing your search above and press return to search.
మెగాప్రిన్స్ లిస్ట్ పెద్దదే.. మరి బ్లాక్ బస్టర్?
By: Tupaki Desk | 16 Dec 2015 1:30 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ ఫాంలోకి వచ్చేశాడు. కంచె ఇచ్చిన ఊపును కంటిన్యూ చేసేస్తున్నాడు. ప్రస్తుతం లోఫర్ ని రిలీజ్ చేసేశాడు. పూరీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీ.. ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ప్రాజెక్టుల విషయంలో మహా స్పీడ్ చూపిస్తున్నాడు ఈ మెగా వారసుడు. ఇప్పటికే వరుణ్ తేజ్ మరుసటి చిత్రంగా మరోసారి క్రిష్ తో జత కట్టబోతున్నట్లు తేలిపోయింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కనుంది ఈ మూవీ.
దీంతోపాటు మరో మూడు సినిమాలు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ క్యూట్ లవ్ స్టోరీ తెరకెక్కించనున్నాడట. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో మూవీకి కూడా పచ్చజెండా ఊపేశాడని తెలుస్తోంది. ఇవి రెండు కూడా దిల్ రాజు నిర్మాణంలో రానుండడం విశేషం. ఆ తర్ావత ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందిన దేవ్ కట్టా డైరక్షన్ లో చేసేందుకు సిద్ధం కానున్నాడు నాగబాబు తనయుడు. ఈనాలుగు సినిమాలు చేయనున్నట్లు ఇప్పటికే కన్ఫాం చేశాడు వరుణ్ తేజ్.
ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది కానీ.. ఇప్పటివరకూ మెగా ఫ్యాన్స్ కి ఓ బ్లాక్ బస్టర్ బాకీ మాత్రం ఉన్నాడు ఈ కుర్రాడు.మొత్తం మెగా ఫ్యామిలీలోకి అందగాడుగా మెగా హీరోలే ప్రశంసించిన వరుణ్ తేజ్ నుంచి.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పూరీ డైరెక్షన్ లో రూపొంది.. ఈ నెల 17న రిలీజ్ కానున్న లోఫర్ మెగా అభిమానుల ఆకలి తీర్చేస్తుందనే అంచనాలున్నాయి.