Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ స్పీడ్ పెంచేశాడు
By: Tupaki Desk | 20 Dec 2015 5:30 PM GMTరెండు సినిమాలు క్లాస్ మూవీస్ చేయడంతో.. వరుణ్ తేజ్ మాస్ అవతారం ఎలా ఉంటుందో అనే ఆసక్తి చాలా నెలల కొనసాగింది. మొత్తానికి లోఫర్ లో తన ఫుల్ లెంగ్త్ మాస్ అవతారంతో అభిమానులను అనందంలో ముంచెత్తాడు వరుణ్ తేజ్. ఫైట్లు - డ్యాన్సులు - రొమాన్స్ విషయంలో.. మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడనే కితాబులు వచ్చాయి. దీంతో వరుణ్ తేజ్ లో జోష్ కూడా బాగా పెరిగింది.
ఇప్పుడీ మెగా హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టేశాడు. తనకు కంచె లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ తో మరోసారి జత కట్టేందుకు ఇప్పటికే సిద్ధమైపోయాడు. వరుణ్ తేజ్ కోసం ఇప్పటికే రాయబారి అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసిన క్రిష్.. తన స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఆ వెంటనే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా సినిమా స్టార్ట్ చేసేసి స్పీడ్ పెంచనున్నాడు. రెండు సినిమాలను ఒకేసారి చేస్తానని చెబ్తున్నాడు. గతంలో క్రిష్ తో కంచె సూపర్ హిట్ అనిపించుకున్నా.. కమర్షియల్ గా మాత్రం అంత సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు రాయబారి విషయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్లుగా ఉంటాయని అంటున్నాడు వరుణ్ తేజ్.
మామూలుగా ఈ మెగా హీరో ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తూనే.. ఏడాదిలో మూడు సినిమాలు ముకుంద - కంచె - లోఫర్ లో స్క్రీన్ పైకి వచ్చేశాయి. ఇక ఒకేసారి రెండేసి చొప్పున చేస్తే.,.. ఇతగాడి స్పీడ్ ని కంట్రోల్ చేయడం కష్టం అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేసే ఈ వరుణ్ తేజ్ కి మెగా ఫ్యాన్స్ నుంచి మాత్రం బోలెడు ప్రశంసలు వస్తున్నాయి.