Begin typing your search above and press return to search.
నాన్న చేసింది రైటేనన్న మెగా ప్రిన్స్
By: Tupaki Desk | 23 Dec 2018 9:10 AM GMTకొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన బాలయ్య ఎవరో నాకు తెలియదన్న నాగబాబు వీడియో ఎంత వైరల్ అయ్యిందో చూసాం. దానికి కౌంటర్లు ఎన్కౌంటర్లు జోరుగానే సాగాయి. వైరల్ చేయడానికి ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్న కొన్ని శక్తులకు ఇది లడ్డు దొరికినట్టు పండగ చేసుకున్నారు. కాని దాని మీద స్పందించడానికి మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వాళ్ళ రియాక్షన్స్ తెలుసుకునే అవకాశం లేకపోయింది. అయితే అంతరిక్షం ప్రమోషన్ లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో దొరికిపోయాడు.
అలా అనడం కంటే పదే పదే ఇంటర్వ్యూయర్ అదే ప్రశ్నను గుచ్చి గుచ్చి అడగటంతో ఒకదశలో విసుగు చెందిన వరుణ్ తన మనసులో మాట బయట పెట్టుకోక తప్పలేదు. ఇలా అనడం గురించి డాడీతో మాట్లాడాను అన్న వరుణ్ తేజ్ దానికి స్పష్టమైన జవాబు అందుకున్నాడట. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదు అనే బాలయ్య వీడియో నాగబాబుతో పాటు తాను కూడా చూశానని తన తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే ఊరికే ఉండనని ఇలా సందర్భం వచ్చినప్పుడు బదులు చెబుతానని చెప్పారట నాగబాబు.
అంతే కాదు ఇలా చేయడం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పట్టించుకోనని చెప్పిన నాగబాబు వరుణ్ తో సైతం ఇదే మాట అన్నాడట. ఒకరకంగా వరుణ్ నాన్న మాటలను పూర్తిగా సమర్ధించినట్టే. అందులో తప్పు బట్టడానికి లేదు. వాళ్ళు చెబుతున్న వెర్షన్ లో కూడా నిజం ఉంది. అయితే ఇలా ఎవరికి వారు అవతలి వారు తెలియదు అని చెప్పుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో కాని సోషల్ మీడియా కొద్దిరోజులు పండగా చేసుకోవడానికి మాత్రం టాపిక్స్ దొరుకుతున్నాయి.