Begin typing your search above and press return to search.
వరుణ్.. ఈ క్యారెక్టర్లతో కష్టమేనబ్బా
By: Tupaki Desk | 18 Jun 2017 8:18 AM GMTమన దగ్గర స్టార్ హీరో అవ్వాలంటే కొన్ని లక్షణాలుండాలి. ముందుగా ఆ హీరోలో చురుకుదనం ఉండాలి. చలాకీగా కనిపించే క్యారెక్టర్లు చేయాలి. అదిరిపోయే ఫైట్లు చేయాలి. డ్యాన్సుల్లోనూ చితగ్గొట్టాలి. మొత్తంగా తెర మీద ఈ రకమైన ‘ఎనర్జీ’ చూపిస్తే తప్ప స్టార్ గా ఎదగడం కష్టం. అందుకే కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే యువ కథానాయకులంతా ఈ విషయాల్లో బాగా ట్రైన్ అయి వస్తారు. తమ ఈ టాలెంట్లను చూపించే క్యారెక్టర్లను ఎంచుకుని సినిమాలు చేస్తారు. ఐతే మెగా కుర్రాడు వరుణ్ తేజ్ మాత్రం దీనికి భిన్నమైన దారిలో నడుస్తున్నాడు. కుర్రాడి బాడీ లాంగ్వేజ్ చూస్తే.. అంత చురుగ్గా కనిపించదు. డ్యాన్సులు చేయలేడు. ఫైట్లలోనూ కష్టమే.
నిజానికి వరుణ్ తేజ్ పర్సనాలిటీకి డ్యాన్సులు.. ఫైట్లలో బాగా ట్రైన్ అయి వచ్చి ఉంటే అతడి రేంజే వేరుగా ఉండేదేమో. కానీ కెరీర్ ఆరంభంలో ముకుంద.. కంచె లాంటి సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడంతో అతడికి వేరే రకమైన ఇమేజ్ వచ్చింది. తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన లోఫర్.. మిస్టర్ తేలిపోయాయి. దీంతో మనకెందుకీ మాస్ అన్నట్లుగా మళ్లీ పాత దారిలో ‘ఫిదా’ చేస్తున్నాడు. ‘ఫిదా’ టీజర్ చూస్తే.. ఇందులోనూ వరుణ్ సాఫ్ట్ క్యారెక్టరే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోయేది కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి.. అందులోనూ అతడి పాత్ర భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చేమో. ఇలాంటి క్యారెక్టర్లతో మాస్ లో పాపులారిటీ సంపాదించడం.. అభిమానుల్ని పెంచుకోవడం అన్నది కష్టం. ఓపక్క తనతో పాటే మెగా ఫ్యామిలీ నుంచి అరంగేట్రం చేసిన సాయిధరమ్ తేజ్ తనదైన ఎనర్జీతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ మధ్య వరుస ఫ్లాపులతో కొంచెం వెనక్కి తగ్గాడు కానీ.. ఒక హిట్టు పడితే మళ్లీ అతడి స్థాయి వేరుగా ఉంటుంది. కానీ ఇటు వరుణ్ మాత్రం వరుసగా డల్ క్యారెక్టర్లతో ఫాలోయింగ్ విషయంలో బాగా వెనుకబడిపోతున్నాడన్న అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/