Begin typing your search above and press return to search.

బాబాయ్ సినిమా రీమేక్ లో మెగా ప్రిన్స్?

By:  Tupaki Desk   |   1 Dec 2019 12:38 PM GMT
బాబాయ్ సినిమా రీమేక్ లో మెగా ప్రిన్స్?
X
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్ ప‌దో సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్ద- అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కిక్ బాక్సర్ గా కనిపించనున్నారు. అత‌డి రోల్ గురించి అభిమానుల‌కు ఇంత‌వ‌ర‌కూ తెలుసు. అయితే ఈ సినిమా క‌థాంశం ఎలా ఉండ‌బోతోంది? స‌్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే క‌చ్ఛితంగా ఉంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమా క‌థ‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన జానీ స్ఫూర్తి అని తెలుస్తోంది. జానీ త‌ర‌హాలోనే ఫుల్ ఎమోష‌న‌ల్ గా ఉంటుంద‌ట‌. అయితే ప‌వ‌న్ స్వ‌యంగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ చిత్రంలో ర‌క‌ర‌కాల పొర‌పాట్ల గురించి అప్ప‌ట్లో ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకున్నారు. చిన్నపాటి త‌ప్పులు చేసి పెద్ద మూల్యం చెల్లించుకున్నార‌న్న ముచ్చ‌టా సాగింది. ఇప్పుడు అలాంటి త‌ప్పులేవీ లేకుండా అదే లైన్ తో బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ సినిమాని రూపొందిస్తున్నార‌న్న ముచ్చ‌టా సాగుతోంది. జానీ రీమేక్ గా ఈ సినిమా ఉండొచ్చ‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. పవ‌న్ త‌ప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా అర‌వింద్ స‌మ‌క్షంలో స్క్రిప్టును తీర్చి దిద్దార‌ట‌. కొత్త కుర్రాడే అయినా కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా చిత్రీక‌రించేందుకు ప్రిప‌రేష‌న్ సాగించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు తండ్రిగా ప్రముఖ త‌మిళ నటుడు మాధవన్ నటించనున్నారని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. వ‌రుణ్ త‌ల్లి పాత్ర‌లో వెట‌ర‌న్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టిస్తార‌ని మ‌రో ప్ర‌చారం వేడెక్కించింది. అయితే దీనిని చిత్ర‌బృందం క‌న్ఫామ్ చేయాల్సి ఉంది.