Begin typing your search above and press return to search.

బాక్సార్‌ గా మారబోతున్న మెగా హీరో!

By:  Tupaki Desk   |   19 Nov 2018 4:21 PM GMT
బాక్సార్‌ గా మారబోతున్న మెగా హీరో!
X
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన నటించిన ‘ఫిదా’ మరియు ‘తొలిప్రేమ’ చిత్రం మంచి విజయాలను దక్కించుకున్న నేపథ్యంలో వరుణ్‌ తర్వాత సినిమాలపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ మరియు ‘ఎఫ్‌ 2’ చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న అంతరిక్షం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వెంకటేష్‌ తో కలిసి అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌ 2’ సంక్రాంతికి రాబోతుంది.

ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే గీతా ఆర్ట్స్‌ లో ఒక చిత్రాన్ని చేసేందుకు వరుణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వచ్చే జనవరిలో వరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో వరుణ్‌ బాక్సర్‌ గా కనిపించబోతున్నాడు. బాక్సింగ్‌ ఛాంపియన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అల్లు అరవింద్‌ ఇప్పటికే కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఫైనల్‌ స్క్రిప్ట్‌ ను సిద్దం చేసే పనిలో కిరణ్‌ కొర్రపాటి ఉన్నాడు. వరుణ్‌ రెండు చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా అవి పూర్తి అయిన తర్వాత కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ లోపు చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చకచక చేయనున్నారు. ప్రముఖ హీరోయిన్‌ ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.