Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్.. 1947 టు 2018
By: Tupaki Desk | 26 March 2018 7:01 AM GMTప్రతి హీరో కూడా కెరీర్లో ఏదో ఒక దశలో ద్విపాత్రాభినయం చేస్తుంటాడు. ఐతే టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ.. వైవిధ్యం చూపించాలంటే చాలా కష్టపడాలి. అందుకు అనుభవం కూడా అవసరం. అందుకే కెరీర్లో చాలా ఏళ్లు గడిచాకే డబుల్ రోల్స్ వైపు వెళ్తుంటారు హీరోలు. ఐతే మెగా కుర్రాడు వరుణ్ తేజ్ మాత్రం కెరీర్లో చాలా త్వరగానే ద్విపాత్రాభినయం చేసేయబోతున్నాడు. ‘ఫిదా’.. ‘తొలి ప్రేమ’ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్న వరుణ్ వరుసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఓ సినిమాను త్వరలోనే మొదలుపెడుతున్న వరుణ్.. ఆ తర్వాత వెంకీతో మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ చేయాల్సి ఉంది.
వీటితో పాటు ‘అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో మూవీ కూడా కమిటయ్యాడు వరుణ్. ఈ చిత్రంలోనే వరుణ్ ద్విపాత్రాభినయం చేస్తాడట. 90ల నాటి నేపథ్యంలో తక్కువ బడ్జెట్లోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా తీసి మెప్పించిన సాగర్.. ఈసారి కూడా ఒక వైవిధ్యమైన పీరియడ్ ఫిలిం చేయబోతున్నాడట. ఇందులో వరుణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఒక పాత్ర ఇండియాకు 1947లో స్వాతంత్ర్యం రావడాని కంటే ముందు పరిస్థితుల్లో సాగుతుందట. మరో పాత్ర 2018 నేపథ్యంలో ఉంటుందట. ఇది వరుణ్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచే సినిమా అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనుంది.