Begin typing your search above and press return to search.

నితిన్ మోసాల్ని నిల‌దీసిన మెగా ప్రిన్స్

By:  Tupaki Desk   |   1 March 2020 12:30 PM GMT
నితిన్ మోసాల్ని నిల‌దీసిన మెగా ప్రిన్స్
X
అవును.. నితిన్ రెండు విష‌యాల్లో మోసం చేశాడు. అవేంటో తెలిస్తే షాక్ తింటారు. ఇంత‌కీ ఏ విష‌యాల్లో అత‌డు మోసం చేశాడు అంటారా? ఒక‌టి అమ్మాయిని ప‌డేసే విష‌యం.. ఇంకోటి ఎవ‌రికీ చెప్ప‌కుండా పెళ్లి కుదిర్చేసుకోవ‌డం. ఇదే విష‌యాన్ని కాస్త అటూ ఇటూగా చెప్పాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. వైజాగ్ లో జ‌రిగిన భీష్మ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్న వ‌రుణ్ తేజ్.. త‌న స్నేహితుడు నితిన్ పై ఫ‌న్నీ పంచ్ లు వేశాడు.

అస‌లు భీష్మ సింగిల్ అని చెబుతూనే మొద‌టి రీల్ అయ్యే లోపే అమ్మాయిని ప‌డేశాడ‌ని ఆ విష‌యంలో మ‌న‌ల్ని మోసం చేశాడ‌ని వ‌రుణ్ ఫ‌న్నీ కామెంట్ చేశాడు. అంతేకాదు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టేయ‌డమే గాక పెళ్లి కుదిర్చేసుకున్నాడ‌ని ఇది కూడా మ‌రో మోసం లాంటిదేన‌ని వ‌రుణ్ ఫ‌న్ క్రియేట్ చేశాడు. సింగిల్‌గా ఉంటానని చెప్పి సినిమా విడుదలకు ముందు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడని తెలిపాడు. ఏదేమైనా అతని విషయంలో చాలా హ్యాపీ అని న‌వ్వేశాడు.

వైజాగ్ గాలి నీరు వంట‌ప‌ట్టాయి. అందుకే ఇక్క‌డే బాక్స‌ర్ షూటింగులో పాల్గొంటున్నాన‌ని ప‌ది రోజులుగా షూటింగ్ సాగుతోంద‌ని తెలిపిన వ‌రుణ్ .. త‌న సినిమా హిట్ట‌యినా ఫీల‌వ‌నంత ఆనందంగా ఉంద‌ని నితిన్ కి ప్ర‌చారం చేసి పెట్టాడు. మొత్తానికి యువ‌హీరోల మ‌ధ్య స్నేహం అలా వైజాగ్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. అన్న‌ట్టు ఇక వ‌రుణ్ బాక్స‌ర్ ప్ర‌చారానికి నితిన్ ముఖ్య అతిధిగా విచ్చేసి వ‌రుణ్ ని కూడా పెళ్లి కొడుకుని చేస్తాడేమో చూడాలి.

ఈ సినిమా ఆరంభానికి ముందే ఒకటిన్నర సంవత్సరాలుగా నితిన్ తో కలిసి ట్రావెల్ చేశామని అన్నాడు. ఈ సినిమా స్టోరీ తనకు ముందే చెప్పాడని వ‌రుణ్ తెలిపాడు. నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యానని పేర్కొన్నాడు. ఇక ఇదే వేదిక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ బాబాయ్ నంబర వన్ అని అన్నాడు. తాను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగానని తెలిపాడు. రక్త సంబంధం కాబట్టి తాను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదని తెలిపాడు.