Begin typing your search above and press return to search.
ఈ ఫ్రీటైమ్ ను బాగా సద్వినియోగం చేసుకున్నానంటున్న మెగాహీరో
By: Tupaki Desk | 27 July 2020 11:30 AM GMTకరోనా కారణంగా ఎప్పుడు లేని విధంగా స్టార్స్ కు ఫ్రీ టైమ్ దొరికింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలలుగా స్టార్స్ ఖాళీగానే ఉంటున్నారు. మరికొన్నాళ్లు ఈ ఫ్రీ టైమ్ వారికి ఉండవచ్చు అంటున్నారు. ఈ ఫ్రీటైమ్ ను స్టార్స్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే అర్థం అవుతుంది. కొందరు ఫ్యామిలీతో గడిపితే కొందరు సినిమాలు చూస్తూ గడిపేశారు. వరుణ్ తేజ్ మాత్రం తనకు ఎంతో ఇష్టం అయిన బుక్స్ చదువుకుంటూ టైం పాస్ చేసినట్లుగా చెబుతున్నాడు.
బుక్స్ చదవడం అంటే ఇష్టం ఉన్న తనకు వరుసగా షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ కారణంగా చదవడం కుదిరేది కాదు. కాని ఇప్పుడు ఫ్రీ టైం ఎక్కువగా ఉంటున్న కారణంగా బుక్స్ చదువుతున్నానన్నాడు. ప్రతి రోజు రెండు గంటలు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు కొంత సమయం జిమ్ కు కేటాయించడంతో పాటు ఎక్కువ సమయంను బుక్స్ చదివేందుకు కేటాయించాడట. మొత్తానికి వరుణ్ తేజ్ ఈ ఫ్రీ టైమ్ లో సినిమాలు చూడకుండా నిద్రకు వినియోగించకుండా బుక్స్ చదవడం అంటే నిజంగా అభినందించాల్సిన విషయంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గద్దలకొండ గణేష్ చిత్రంతో సక్సెస్ దక్కించుకున్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అంతర్జాతీయ ఛాంపియన్స్ వద్ద బాక్సింగ్ పై అవగాహణ తెచ్చుకున్నాడు. బాక్సింగ్ పై పట్టు కోల్పోవద్దనే ఉద్దేశ్యంతో ఈ లాక్ డౌన్ లో కూడా రోజు రెండు గంటల పాటు బాక్సింగ్ ను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడట. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ను పున: ప్రారంభించబోతున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంను అల్లు అరవింద్ సమర్పించబోతున్నాడు.